మజ్ను సినిమాలో అటు రాజమౌళినీ ఇటు బాహుబలినీ ఎడా పెడా వాడేసుకొన్నాడు నాని. ఆయనకూ రాజమౌళి ఫ్యామిలీకీ ఉన్న ఎటాచ్మెంట్ అట్టాంటిది. కాబట్టి నో ప్రాబ్లం! ఇప్పుడు నిఖిల్ కూడా నేను సైతం అంటూ రాజమౌళిని వాడేసుకోవడానికి రంగంలోకి దిగాడు. నిఖిల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఈ సినిమాలోనూ జక్కన్న భజన కనిపించనుందీ.. వినిపించనుంది. ఇందులో నిఖిల్ బాహుబలి 2 సినిమాకి గ్రాఫిక్స్ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. ఆ సమయంలోనే రాజమౌళి, బాహుబలి ప్రస్తావన ఈ సినిమాలో రానుంది. ఓ ఫ్రేమలో రాజమౌళి కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇలా అప్పుడప్పుడూ గెస్ట్ రోల్స్ లో కనిపించడం రాజమౌళికీ సరదానే. నిఖిల్ అంటే తనకున్న ప్రత్యేక అభిమానంతో ఈ సినిమాలో రాజమౌళి కనిపించనున్నాడని టాక్. అయితే అది కొద్ది సేపు మాత్రమే.
ఇలా రాజమౌళి పేరుని వాడేసుకొంటున్నట్టు ఆయనకు తెలుసా?? అని అడిగితే… ”బాహుబలి, రాజమౌళి యూనివర్సల్ ప్రోపర్టీస్..” అంటూ నవ్వేస్తున్నాడు నిఖిల్. అయితే ఇప్పటికే బాహుబలిపై బోల్డన్ని జోకులు సినిమాల్లో చూపించేశారు. పేరడీలు చేసేశారు. రాజమౌళి, బాహుబలి, కట్టప్ప, భళ్లాలదేవ.. ఇలాంటి పేర్లని లెక్కకు మించి వాడేసుకొన్నారు. నాని సినిమా మజ్ను అయితే బాహుబలి 2 సెట్‌కే వెళ్లి హంగామా చేశాడు. ఇంతమంది ఇన్ని విధాలుగా వాడేసుకొన్నాక నిఖిల్ కొత్తగా ఏం చేస్తాడో, ఏం చూపిస్తాడో..??