ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకులు, కథల అన్వేషణలో ఉన్నాడు. తొందరగా సినిమా మొదలెట్టేయాలన్న ఆలోచన లేకపోయినా.. ఓ కథ ఫిక్స్ చేసుకొని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేస్తే తన సినిమాపై పెరుగుతున్న రకరకాల ఊగాహానాలు, గందరగోళాలకు చెక్ పెట్టొచ్చని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ వి.వి.వినాయక్. ఎందుకంటే స్టార్ హీరోలంతా చేతిలో సినిమాలతో బిజీగా ఉన్నారు. వినాయక్ మాత్రం జనవరిలో ఖాళీ అయిపోతాడు. ఆ తరవాత తనకేం కమిట్మెంట్స్ లేవు. పైగా ఎన్టీఆర్ – వినాయక్‌ల మధ్య రాపో చాలా బాగుంటుంది. వాళ్లిద్దరి నుంచి హిట్ సినిమాలొచ్చాయి. సో.. కాంబినేషన్‌పై జనాలకు హోప్స్ ఉంటాయి. అందుకే దాదాపుగా వినాయక్‌తో నే ప్రయాణం చేయడానికి ఎన్టీఆర్ ఫిక్సయిపోయాడని టాక్.
ఈ నేపథ్యంలో ఇటీవల వినాయక్, ఎన్టీఆర్ అర్జెంట్ మీటింగ్ ఒకటి వేసుకొన్నారని తెలుస్తోంది. ఇద్దరూ కూర్చుని దాదాపు రెండు గంటల సేపు చర్చలు జరిపారు. తదుపరి ఎలాంటి కథ చేయొచ్చన్న విషయంపై ఇద్దరి మధ్య డిస్కర్షన్స్ సాగాయని తెలుస్తోంది. అదుర్స్ 2 గురించీ టాపిక్ వచ్చిందట. అయితే ఎన్టీఆర్ మాత్రం సీక్వెల్స్ జోలికి వెళ్లొద్దని భావిస్తున్నాడట. ఈమధ్య తాను విన్న కొన్ని కథల గురించి వినాయక్‌తో చెప్పి అభిప్రాయం అడిగాడట. మొత్తానికి వినాయక్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఈ మీటింగ్‌ని వాడుకొన్నాడు ఎన్టీఆర్. వినాయక్ కూడా ఎన్టీఆర్‌తో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని… ఎన్టీఆర్ ఇమేజ్‌కి సంబంధించిన కథ కోసం అప్పుడే సెర్చింగ్ మొదలైందని తెలుస్తోంది.