రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ధృవ. డిసెంబరు 9న విడుదల అవుతోంది. పాటల్ని నేరుగా విడుదల చేసి.. లొప్రొఫైల్ మెయిన్టైన్ చేశాడు చరణ్. ఇప్పటి వరకూ… ఈ సినిమాకి సంబంధించిన ఒక్క వేడుకా జరగలేదు. ఇప్పుడు ట్రైలర్‌నీ గప్ చుప్‌గా విడుదల చేస్తున్నారు. 25న సాయింత్రం 7 గంటలకు ఆన్ లైన్లో ధృవ థియేటరికల్ ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారు. నిజానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే ట్రైలర్ చూపించాలని చిత్రబృందం భావించింది. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కీ రిలీజ్ డేట్ కీ మధ్య గ్యాప్ లేకపోవడంతో.. ముందే ట్రైలర్‌ని చూపించాలని డిసైడ్ అయ్యింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున మరో ట్రైలర్‌ని చూపిస్తారట. వీడియో సాంగ్స్‌నీ ఆరోజు ప్రొజెక్ట్ చేస్తారని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించింది. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ బోర్డు యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిడివి దాదాపు 152 నిమిషాలు ఉందని టాక్. అయితే.. విడుదలకు ముందు సినిమాని మరో సారి చూసుకొని ట్రిమ్ చేద్దామని చరణ్ భావిస్తున్నాడట. ఫైనల్ అవుట్ పుట్ 140 నిమిషాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమాలోని పాటలు ఓకే అనిపించాయి. టీజర్‌కీ యావరేజ్ మార్కులే పడ్డాయి. కనీసం ట్రైలర్ అయినా.. ‘ఈ సినిమా హిట్ గ్యారెంటీ’ అనే భరోసాని కలిగిస్తాయేమో చూడాలి.