త్వరలో ఎన్నికలు జరుగబోతున్న ఉత్తర ప్రదేశ్ లో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని `విఫలమైన నాయకుడు’గా పరిగణిస్తే, పార్టీ పరిస్థితి మెరుగు పరచడం కోసం ప్రియాంక గాంధీ రాష్ట్రం అంతా ప్రచారం చేయాలని పార్టీలో వినిపిస్తున్న కథనాలకు పార్టీ అధ్యక్షుడు సోనియా గాంధీ చెక్ పెట్టారు. ప్రియాంక క్రియాశీల రాజకీయాలలోకి వచ్చే ప్రసక్తి లేదని, ఉత్తర ప్రదేశ్ లో విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం లేదని కూడా స్పష్టం చేసిన్నట్లు తెలిసింది.
వాస్తవానికి నానమ్మ ఇందిరా గాంధీ జయంతి రోజయిన నవంబర్ 18న అలహాబాద్ లో జరిగే ర్యాలీ లో పాల్గొనడం ద్వారా ప్రియాంక రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు, ఆ రోజు నుండి ఆమె రాష్ట్రం అంతా ప్రచారంలో పాల్గొనగలరని అంటూ కొంతకాలంగా పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. “ప్రియాంక రావాలి… కాంగ్రెస్ ను కాపాడాలి” అంటూ ఆమె మద్దతు దారులు నినాదాలు ఇస్తున్నారు. అయితే వీరందరిని సోనియా మందలించినట్లు తెలిసింది.
చాలారోజుల తరువాత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె జీవితంపై అలహాబాద్ లోని `స్వరాజ్య భావం’ లో ఒక ప్రదర్శనను ప్రారంభించడం ద్వారా బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. పైగా రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వాన్ని చేపట్టబోతున్నట్లు కూడా సంకేతం ఇచ్చారు.
ఇప్పటివరకు అమ్మ, అన్న ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే పరిమితం అవుతున్న ప్రియాంక రాష్ట్రం అంతా ప్రచారం చేయబోతున్నారని అంతకు ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్, సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్ వెల్లడించారు. దానితో సోనియా, రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. ఆ మరుసటి రోజే మరో నాయకుడితో ఇంకా ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పించారు.
ఇప్పుడు ప్రియాంక రంగంలోకి వస్తే రాహుల్ ని పక్కన పెట్టిన్నట్లు తప్పుడు సంకేతం ఇచ్చిన్నట్లు కావడంతో పాటు, పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉన్నదనే భయంతోనే సోనియా ఇటువంటి నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తున్నది. తన అలహాబాద్ పర్యటన సందర్భంగానే ప్రింయంక గురించి వస్తున్న వార్త కథనాలకు ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేసారు.
ఈ సందర్భంగా ఇండియా టుడే టివి కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ కు నరేంద్ర మోడీ వంటి బలమైన నాయకుడు లేరు గదా అని రాజ్ దీప్ సర్దేసాయ్ ప్రశ్నించినప్పుడు ఇందిరా గాంధీ గురించి కూడా మొదట్లో అట్లాగే అనే వారని ఆమె గుర్తు చేశాయి. అయితే ఆ తరువాత ఆమె పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా పనిచేశారని అన్నారు.
ఈ విధంగా చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ గురించి ఎవ్వరు, ఏ విధంగా భావిస్తున్నా త్వరలోనే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్నట్లు ఆమె స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్లు అయింది. ఒకవిధంగా పార్టీ నాయకులకే ఈ సంకేతం ఇచ్చిన్నట్లు ప్రయత్నం చేసిన్నట్లు అయింది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే ప్రధాన మంత్రి పదవి చేపట్టేది కూడా రాహుల్ అని ఆమె స్పష్టం చేసిన్నట్లు అయింది.
అంతకు కొద్దీ రోజుల ముందే ఢిల్లీ లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరు కాకుండా రాహుల్ గాంధీ ని పంపి అధ్యక్షత వహించే టట్లు చేయడం, వెంటనే పార్టీ నాయకత్వం చేపట్టాలని ఏ కె ఆంటోనీ వంటి సీనియర్ నాయకులూ కొరేటట్లు చేయడం కూడా ఆమె వ్యూహం ప్రకారమే జరిగిన్నట్లు కనబడుతున్నది.