చిరంజీవి ఫ్యాన్స్ – పవన్ కల్యాణ్ ఫ్యాన్స్… ఇలా మెగా ఫ్యాన్స్ లో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. వీటి మధ్యలో అల్లు అర్జున్ కూడా ‘సెపరేట్’ సిద్దాంతాన్ని ఫాలో అవుతున్నాడని మెగా ఫ్యాన్సే చెబుతుంటారు. బన్నీకంటూ ఓ ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. వాళ్లు కేవలం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే. బన్నీ సినిమాల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే చరణ్‌కి మాత్రం అందరూ కావాలి. అందుకే చరణ్ సినిమా వస్తోందంటే.. అటు పవన్ ఫ్యాన్స్ ని సైతం ప్రసన్నం చేసుకోవాలని చూస్తుంటాడు. పవన్ ఫ్యాన్స్‌ని తన వైపుకు తిప్పుకోవాలనే పవన్‌కి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. బ్రూస్లీ సమయంలో పవన్ సెట్‌కి వెళ్లి, బాబాయ్ ఆశీస్సులు తీసుకోవడం అందులో భాగమే. అయితే.. ఇప్పుడు చరణ్ ఆలోచనలు మారాయేమో అనిపిస్తోంది. చిరు – పవన్‌ల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా బాబాయ్ పక్షాన నిలబడడం అంత మంచిది కాదని ఫీలవుతున్నాడేమో అనిపిస్తోంది. అందుకే.. ఇప్పుడు తన కెరీర్‌కి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని టాక్.
రామ్‌చరణ్ ని అభిమానులు ‘మెగా పవర్ స్టార్’ అని పిలుచుకొంటుంటారు. టైటిల్ కార్డులోనూ అదే బిరుడు చూస్తుంటాం. అయితే ఇప్పుడు ఆ పిలుపు, బిరుదు మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ధృవ కోసం `యంగ్ మెగాస్టార్` అనే బిరుదు జోడిస్తున్నారని చెప్పుకొంటున్నారు. నిజంగా ఈ ఆలోచనకు చరణ్ ఒప్పుకొంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఈ చర్యతో పవన్ ఫ్యాన్స్ చరణ్‌కి దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బిరుదు మార్చడం వెనుక ఉన్న ఆలోచనలు ఏవైనా.. పవన్ అభిమానులకు మాత్రం అది వ్యతిరేక సంకేతాల్ని పంపే ప్రమాదం ఉంది. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ ‘మేం కేవలం పవన్ ఫ్యాన్స్’ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. చరణ్ ఇలాంటి తప్పులు చేస్తే… ఆ గీత మరింత జటిలమయ్యే ఛాన్సులున్నాయి. చరణ్‌కి సంబంధించిన ప్రతీ విషయంలోనూ చిరు ఇన్వాల్వ్మెంట్ తప్పని సరిగా ఉంటుంది. తమ్ముడికీ తనకీ మధ్య ఎన్ని అడ్డుగోడలలు ఉన్నా.. తన తనయుడి కెరీర్‌పై ఆ ప్రభావం పడకూడదన్నది తండ్రిగా చిరు ఆలోచన. మరి ఆయన ఈ బిరుదు విషయమై.. చరణ్‌కి ఏమైనా సలహాలిస్తాడేమో చూడాలి.