ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది మూవీగా మారిన సినిమా… రాజుగారి గది 2. నాగార్జున ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడంతో ఈ సినిమా క్రేజ్ పెరిగింది. రాజుగారి గది ఆల్రెడీ పెద్ద హిట్. దానికి సీక్వెల్ అంటే అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి. ఎప్పుడైతే నాగ్ ఈ సినిమాలో ఓ కీ రోల్ చేయడానికి ముందుకొచ్చాడో అప్పుడు మరింత గా ఈసినిమా పై ఫోకస్ పెరిగింది. నాగ్ దెయ్యం పాత్రలో కనిపించడానికి ముందుకు రావడం.. ఆయన గెటప్ కూడా కొత్తగా ఉంటుందన్న ప్రచారం సాగడం ఈ సినిమాకి కలిసొచ్చే విషయాలు. ఇందులో ముగ్గురు కథానాయికలకు చోటుందని తెలుస్తోంది. అందులో భాగంగా సీరత్ కపూర్‌ని ఓ కథానాయికగా ఎంచుకొన్నార్ట.
రన్ రాజా రన్. టైగర్ సినిమాతో ఆకట్టుకొంది సీరత్. ఆ సినిమాలు బాగా ఆడినా.. సీరత్‌కు పెద్దగా కలసి రాలేదు. సడన్‌గా రాజుగారి గది 2 బృందం నుంచి సీరత్‌కు పిలుపొచ్చింది. మరో ఇద్దరు కథానాయికల్ని ఎంపిక చేయాల్సివుంది. కొత్తవాళ్లని తీసుకోవాలని ముందు భావించినా.. ఇప్పుడు మాత్రం ఆ ఆలోచన నుంచి విరమించుకొన్నట్టు తెలుస్తోంది. పేరున్న కథానాయికల్ని తీసుకొంటే ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడుతుందని పీవీపీ భావిస్తోంది. ఆ ఇద్దరు ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమా కోసం నాగ్ 50 రోజుల పాటు కాల్షీట్లు కేటాయించాడట. అందుకోసం భారీ మొత్తమే పారితోషికంగా అందుకొన్నాడని టాక్.