అందాల నటి కృతి సనన్ ఓ వెరైటీ డ్రెస్ లో కనిపిస్తున్న ఫొటో ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది. వన్ నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి ఇప్పుడు ఇంటర్ నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. కొత్తగా విడుదలైన 2 వేల రూపాయల నోట్ల డిజైన్ తో తయారైన గౌను వేసుకున్నట్టు కనిపిస్తున్న ఫొటో ఇది.
నిజానికి ఆమె నోట్ల డిజైన్ గౌన్ వేసుకోలేదు. తెల్ల రంగు గౌను వేసుకున్నప్పటి ఫొటో అది. టెక్నాలజీని వాడుకోండని బ్రహ్మానందం చెప్పిన మాట విన్నారో ఏమోగానీ, ఎవరో మార్ఫింగ్ చేశారు. చాలా క్రియేటివ్ గా, ఫొటో షాపులో తెల్ల గౌనును కాస్తా ఇలా నోట్ల గౌనులా మార్చేశారు.
కొత్త 2 వేల నోట్లు నెలరోజుల్లోనే కొందరి దగ్గర కట్టలు కట్టలుగా బయట పడుతున్నాయి. కృతి సనన్ కూడా అలాగే కట్టలకొద్దీ నోట్లను సంపాదించి ఈ డ్రెస్ కుట్టించుకుందని అంతా అనుకోవాలని ఈ పనిచేశారా? లేక ఆకతాయి తనంగానో సరదాగానో ఇలా చేశారోగానీ ఫొటో మాత్రం చాలా మందిని ఆకర్శిస్తోంది.