ఓ విధంగా చెప్పాలంటే బాబి జాక్ పాట్ కొట్టేశాడు. సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్‌తో సినిమా అంటే మాటలా..? అదీ చాలామంది దర్శకుల కథలు విన్న తరవాత.. వాటన్నింటినీ పక్కన పెట్టి, బాబికి అవకాశం రావడం షాకింగ్ న్యూసే. అదీ కాక.. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఫ్లాప్ ఇచ్చాక కూడా బాబిని ఎన్టీఆర్ నమ్మాడంటే కథెంత నచ్చేసి ఉంటుందో కదా? ఎన్టీఆర్ సినిమా ఓకే అయిపోయిన సంతోషంలో బాబి కూడా ఇంకా బయటకు రాలేదేమో..? అందుకే అత్యుత్యాహం ప్రదర్శిస్తున్నట్టు ఇండ్రస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కథ గురించి అందులోని మెయిన్ పాయింట్స్ గురించి బాబి చాలామంది దగ్గర డిస్కర్స్ చేశాడట. అవి ఆనోటా.. ఈ నోటా బయటకు వచ్చేస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని, ముగ్గురు హీరోయిన్లు ఉంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి నిజమే అయినా.. సినిమాకి సంబంధించి చాలా కీలకమైన ట్విస్ట్ ని ముందే రివీల్ చేసినట్టైందని, దాని వల్ల… సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్ థ్రిల్ ఫీలవ్వడని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఈ విషయంపై బాబితో కాస్త సీరియస్ గానే డిస్కర్స్ చేసినట్టు, ఇక ముందు ఇలాంటి లీకులు లేకుండాచూసుకోమని స్ట్రాంగ్ గా చెప్పేశాడట ఎన్టీఆర్.
అంతేకాదు.. కాస్టింగ్‌కి సంబంధించిన ఎలాంటి డిటైల్స్ ముందే బయటకు పొక్కకూడదని, వాటి గురించి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశాకే వాటిపై మాట్లాడాలని క్లియర్‌గా చెప్పేశాడట. మొత్తానికి బాబిని ఎన్టీఆర్ తన రూట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బాబీకీ అదే మంచిది. ఎందుకంటే ఎన్టీఆర్ భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. పైగా సొంత సంస్థలో చేస్తున్న సినిమా. ఎన్టీఆర్ గైడెన్స్‌లోనే బాబి నడవాల్సివుంది. అదేం తప్పు కూడా కాదు. సో… ఇక నుంచి లీకేజీలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాబీదే అన్నమాట.