గౌతమి పుత్ర శాతకర్ణిపై ఇప్పటికే అంచనాలు చాలా చాలా పెరిగిపోయాయి. మొన్న టీజర్… నిన్న ట్రైలర్‌తో అవి తారా స్థాయికి చేరుకొన్నాయి. దానికి తోడు ఇప్పుడు సెలబ్రెటీలంతా గౌతమి పుత్రుడ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఈ ట్రైలర్ ప్రస్తుతం ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది. సెలబ్రెటీలంతా ముక్త కంఠంతో శభాష్ క్రిష్ అంటూ పొగిడేస్తున్నారు. ఈ ట్రైలర్ చూసిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా థ్రిల్ ఫీలయ్యాడట. వెంటనే క్రిష్‌కి ఫోన్ చేసి తన అభినందనలు తెలిపాడట. “ట్రైలర్ చాలా బాగుంది. అంచనాలు పెరిగిపోయాయి. దాన్ని అందుకోవాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి.. ఏ క్షణం వదలొద్దు.. అహర్నిశలూ సినిమా కోసం కష్టపడు.“ అంటూ గైడెన్స్ ఇచ్చాడట. విజువల్స్, గ్రాఫిక్స్, డీఐ వీటన్నింటిపై రాజమౌళి కొన్న సూచనలు చేసినట్టు సమాచారం. రాజమౌళి నుంచి ఫోన్ రావడంతో క్రిష్ కూడా హ్యాపీగా ఫీలౌతున్నాడట. బాహుబలి సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్ ని పీక్స్‌లో చూపించాడు జక్కన్న. అలాంటి దర్శకుడికి తన వర్క్ నచ్చడంతో క్రిష్ ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది.
నిజానికి గౌతమి పుత్ర ట్రైలర్ ఈ స్థాయిలో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. మరీ ముఖ్యంగా క్రిష్ విజువల్ సెన్స్ ఆశ్చర్యపరిచాయి. చాలా తక్కువ టైమ్‌లో ఇంత అవుట్ పుట్ రావడం నిజంగా గ్రేటే. కేవలం 80 వర్కింగ్ డేస్‌లో ఈ సినిమా పూర్తి చేశాడు క్రిష్. బడ్జెట్ రూ.55 కోట్లు లోపే. విజువల్ ఎఫెక్ట్స్‌కీ మరీ ఎక్కువేం పెట్టుబడి పెట్టలేదు. కానీ.. ఇంత గ్రాండ్‌గా తెరకెక్కించడం గొప్ప విషయమే. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏ స్థాయిలో కష్టపడితే ఎంత ప్రతిఫలం వస్తుందో జక్కన్నకు బాగా తెలుసు. అందుకే.. ఫోన్ చేసి సాటి దర్శకుడ్ని మెచ్చుకొన్నాడు. ఇది క్రిష్‌లో మరింత ఆత్మ విశ్వాసం పెంచడం ఖాయం. ఆ ప్రభావం అవుట్ పుట్ లోనూ కనిపిస్తే.. హ్యాపీనే కదా?