చిరంజీవి 150 వ సినిమాలో తాము కూడా కనిపించాలని మెగా హీరోలంతా తహతహలాడారు. రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్… ఇలా మెగా హీరోలంతా అప్లికేషన్లు పెట్టుకొన్నారు. కానీ చిరు తనయుడిగా రామ్‌చరణ్‌కి రిజర్వేషన్లు దక్కాయి. అందుకే చిరు సినిమాకి నిర్మాతగా మారాడు.. ఓ పాటలో చిరుతో కలసి స్టెప్పులు కూడా వేశాడు. అయితే.. ఈ సినిమాలో చరణ్ కనిపించేది 30 సెకన్లు మాత్రమే. ఓ స్టెప్పు వేసి, చిరుకి ఓ హగ్ ఇచ్చి, అలా వెళ్లిపోతాడు. చరణ్ కాకుండా ఇతర మెగా హీరోలెవరైనా ఈ సినిమాలో కనిపిస్తారా? అనే డౌట్లు చాలా మందికి ఉన్నాయి. వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్ లలో ఎవరైనా సర్ప్రైజ్ చేస్తారేమో అనుకొంటున్నారు. అయితే అలాంటి షాకింగ్ ప్యాకేజీలు ఏమీ లేవని సమాచారం. చరణ్ తప్ప ఈ సినిమాలో ఇంకో మెగా హీరో ఎవ్వరూ కనిపించరని తేలిపోయింది. చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్లో అయితే వరుసపెట్టి గెస్ట్‌లు వస్తూనే ఉంటారు. ఆఖరికి పవన్ కల్యాణ్ కూడా దిగిపోయాడు.
ఇంతా పోగేస్తే… ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇంత మంది మెగా హీరోలు దిగిపోయినా ఆ సినిమాని బతికించలేకపోయారు అన్న కామెంట్లు వినిపించాయి. మళ్లీ అలాంటి బ్యాడ్ టాక్ రాకుండా ఉండాలంటే… ఎగస్ట్రాలకు పోకూడదని చిరు భావించినట్టున్నాడు. అందుకే.. చరణ్‌కి తప్ప ఇంకొకరికి ఎంట్రీ లేకుండా పోయింది. అయితే ప్రమోషన్లలో మాత్రం మెగా హీరోలందరినీ వాడుకొనే ఛాన్సులున్నాయి. మరి ఎవరెవరు ఏయే స్థాయిలో చిరు రీ ఎంట్రీ సినిమా ప్రమోషన్లలో ఇతోదికంగా సాయపడతారో చూడాలి.