అశోక్ గ‌జ‌ప‌తిపై ఉల్టా కౌంట‌ర్ ప‌డింది..!

మంత్రులం కదా… మ‌నం ఏం మాట్లాడినా ఫ‌ర్వాలేదూ, అధికారులు ప‌డుంటారు అనే అభిప్రాయం తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌తీసారీ ఏలిక‌ల‌కు ఉంటుంద‌న్న విమ‌ర్శ ఎప్ప‌ట్నుంచో ఉంది. ఆ ముద్ర‌ను చెరుపుకునేందుకు చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా ప్ర‌య‌త్నించిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే, ఎవ‌రేమ‌న్నా ప‌డి ఉండ‌టానికి అంద‌రు అధికారులూ ఒకేలా ఉండ‌రు! నాయ‌కుల తీరును ఉల్టా విమ‌ర్శించేవారూ ఉంటారు. టీడీపీ ఎంపీ, కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు ఇప్పుడు అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంద‌ని స‌మాచారం!

ఎయిర్ ఇండియా ఉద్యోగుల‌ను ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రివ‌ర్స్ అయ్యాయి! ఉద్యోగుల్లో అంకిత భావం లోపించింద‌ని రాజావారు కామెంట్ చేశార‌ట‌. ప‌నిప‌ట్ల అంకింత భావంతో ఉన్న‌వారు త‌క్కువ‌య్యార‌నీ, లేదంటే ఎయిర్ ఇండియా మంచి లాభాల్లో ఉండేద‌న్న మీనింగ్‌లో వ్యాఖ్యానించారు. అక్క‌డితో ఆగితే బాగుండేది. ప్రైవేటు విమాన‌యాన సంస్థ‌ల ఉద్యోగుల ప‌నితీరుతో వాళ్ల‌ని పోల్చారు! ప‌క్క‌వారితో పోల్చితే ఎవ‌రికైనా కోపం వ‌స్తుంది క‌దండీ. శుభాషిస్ మంజుందార్ అనే పైలెట్‌కి మంత్రిగారి వ్యాఖ్య‌లు మంట‌పుట్టించాయి. వెంట‌నే ఆయ‌న‌కు క్లాస్ తీసుకుంటూ లేఖ రాశాడు.

తానో ఎయిర్ ఇండియా ఉద్యోగిన‌నీ, ఎంతో అంకిత భావంతో దేశ‌భ‌క్తితో విధులు నిర్వ‌హిస్తున్నాన‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నాడు. ‘నా సంగ‌తి స‌రే… దేశంపై బాధ్య‌త ఉండాల్సిన మీరేం చేస్తున్నారు? గ‌డ‌చిన పార్ల‌మెంటు స‌మావేశాల్లో విలువైన 92 గంట‌ల స‌మ‌యాన్ని వృథా చేశారు. ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తోనే కాలం గ‌డిపేశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌లేక‌పోయారు. స‌భ స‌జావుగా సాగ‌కుండా అడ్డుప‌డట‌మే క‌దా మీరు చేసింది. ఇత‌ర దేశాల చ‌ట్ట స‌భ‌ల‌తో పోల్చి చూస్తే మీరు ఎక్క‌డున్నారో చూసుకోండి’ అంటూ లేఖ‌లో వాయించేశాడు.

త‌మ‌ను ఇత‌ర సంస్థ‌ల ఉద్యోగుల‌తో పోల్చేస‌రికి… ఇత‌ర దేశాల నాయ‌కులతో మంత్రుల‌ను ఆ పైలెట్ పోల్చాడు. ఉద్యోగుల‌ను ఉత్సాప‌ర‌చాల‌న్న ఉద్దేశంతో అశోక్ గ‌జ‌ప‌తి క్లాస్ తీసుకుంటే.. అది కాస్తా ఇలా రివ‌ర్స్ అయింది. ఇప్పుడీ పైలెట్ లేఖ‌కు నెటిజ‌న్ల మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తోంది. ఆ పైలెట్ చెప్పింది నిజ‌మే క‌దా అంటూ చాలామంది స‌మ‌ర్థిస్తున్నారు. అయినా… మ‌న సంస్థ‌ను మ‌న‌మే కాపాడుకుందాం, క‌ష్ట‌ప‌డి ప‌నిచేద్దాం అంటూ ఉద్యోగుల‌కు సాఫ్ట్‌గా చెప్పాలిగానీ, ఇలా పెత్త‌నం చెలాయించాల‌నుకుంటే భ‌రించే రోజులా ఇవి..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close