అసెంబ్లీలో హైడ్రామా

తెలంగాణ అసెంబ్లీలో చాలా కాలం త‌ర్వాత అనూహ్య స‌న్నివేశం క‌నిపించింది. స‌భ‌లో హైడ్రామా కొన‌సాగింది. వాయిదా అనంత‌రం కూడా స‌భ‌లోనే బైఠాయించిన ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపించాల్సి వ‌చ్చింది. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ పై చ‌ర్చ త‌ర్వాత ఈ ప‌రిణామాలు జ‌రిగాయి.

విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ అంశంపై ఇవాళ స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ప్ర‌భుత్వ వైఖ‌రిని విమ‌ర్శించారు. కాలేజీల‌కు ఫీజులు చెల్లించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌వుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అస‌లు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తారా లేదా అని నిల‌దీశారు. ప్ర‌భుత్వం విద్యార్థుల భ‌విష్య‌త్తును ప‌ణంగా పెడుతోంద‌ని ఆరోపించారు.

ఈ అంశంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ త‌ర్వాత స‌భ రేప‌టికి వాయిదా ప‌డింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం స‌భ్యులు నిర‌స‌న తెలిపారు. సీఎం స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేద‌న్నారు. తాము వివ‌ర‌ణ అడ‌గ‌టానికి అవ‌కాశం ఇవ్వ‌కుండా స‌భను వాయిదా వేశార‌ని నిర‌స‌న తెలిపారు. స‌భ‌లోనే బైఠాయించారు.

దీంతో అసెంబ్లీ కార్య‌ద్శి స‌దారాం సీఎల్పీ నేత జానారెడ్డిని క‌లిశారు. నిర‌స‌న విర‌మించాల‌ని కోరారు. అయినా జానారెడ్డి స‌హా ప్ర‌తిప‌క్ష నేత‌లు ఒప్పుకోలేదు. అధికార ప‌క్ష వైఖ‌రికి నిర‌స‌నగా స‌భ‌లోనే ఉంటామ‌ని తేల్చి చెప్పారు. దీంతో వారిని బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపాలంటూ స్పీక‌ర్ ఆదేశించారు. దీంతో ప్ర‌తిప‌క్ష స‌భ్యులను పోలీసులు బ‌ల‌ప్ర‌యోగంతో బ‌య‌ట‌కు పంపారు. కాంగ్రెస్ స‌భ్యుల‌ను గాంధీ భ‌వ‌న్ ద‌గ్గ‌ర వ‌దిలిపెట్టారు. టీడీపీ స‌భ్యుల‌ను ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ద్ద వ‌దిలేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close