”అవకాశం ఉంటే నా ఆడియో ఫంక్షన్లకు నేనే రాను” అంటూ ఓ ఆడియో ఫంక్షన్లో అతి పెద్ద జోక్ వేశాడు మంచు విష్ణు. ఆ వీడియో ఫుటేజ్‌ని కట్ చేసుకొని,.. దానిపై సెటైర్లు వేసుకొన్నారు నెటిజన్లు. టోటల్ ఎపిసోడ్ ఎంత కామెడీ అయిపోయిందంటే.. విష్ణు స్పీచ్‌ని పేరడీ చేస్తే లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ పేరడీ వీడియోని స్వయంగా విష్ణు స్పందించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు సేమ్ డైలాగ్ `గుంటూరోడు` ఆడియో ఫంక్షన్లో పేల్చాడు విష్ణు. ”ఈ ఆడియో ఫంక్షన్‌ని రాకపోదును.. ఇంట్లో నన్ను రానివ్వరు అందుకే వచ్చా” అంటూ హొయలుపోయాడు విష్ణు. దాదాపుగా మోహన్ బాబుదీ అదే థీరి. ”ఈ ఆడియో ఫంక్షన్‌కి రాకూడదనుకొన్నా. మొన్న లక్కున్నోడు ఆడియో ఫంక్షన్‌కి వెళ్లి.. ఇప్పుడు రాకపోతే చిన్నోడు ఫీలవుతానని వచ్చా” అంటాడాయన.
అసలు మంచు ఫ్యామిలీ మొత్తం ఇలానే ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాదు. ఆడియో ఫంక్షన్లంటే వీళ్లని అలర్జీనా?? అనే అనుమానం వస్తుంటుంది అప్పుడప్పుడూ. సినిమా రంగంలో ఉంటూ.. సొంతంగా సినిమాలు చేసుకొంటూ.. ఆడియో ఫంక్షన్‌కి రావడం అంటే ఆకాశాన్ని మోసినట్టు ఎందుకు ఫీలైపోతుంటారో..? అదీ పరాయివాళ్ల ఫంక్షన్ కాదు కదా? వీళ్ల ఆడియో ఫంక్షన్లకే `ఎందుకొచ్చాన్రా బాబూ` అనుకొంటుంటే.. బయటి హీరోలెందుకు రావాలి? ఇదంతా గొప్ప కోసం మాట్లాడుకొనే మాటలా, నిజంగానే ఆడియో ఫంక్షన్లంటే విరక్తా? అలాంటప్పుడు సొంతసినిమాలకు ఆడియో ఫంక్షన్లు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఇలానే మరో రెండు మూడు ఆడియో ఫంక్షన్లలో మాట్లాడితే… బయటి హీరోలు మంచు ఫ్యామిలీ ఆడియో రిలీజ్ అంటే.. పారిపోవడం ఖాయం. గుంటూరోడు ఆడియో ఫంక్షన్‌పై కొత్త కొత్త పేరడీలు సిద్ధమవుతున్నాయిప్పుడు. వాటిపైనా విష్ణు స్పందిస్తాడా? చూడాల్సిందే.