గాసిప్పు రాయుళ్లు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. సినిమా ఇలా మొదలైందో లేదో… స్టోరీ ఏంటి? అందులో హీరో క్యారెక్టర్ ఏంటీ? అంటూ కూపీలు లాగేస్తున్నారు. ఈరోజే.. సాయిధరమ్ తేజ్ ‘జవాన్’ సినిమాకి కొబ్బరికాయ్ కొట్టారు. ఈ సినిమా ఇలా మొదలైందో లేదో.. అలా కథని బయటకు లాగేశారు. ‘జవాన్’ కథేంటీ?? అనేది టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న తాజా వార్త. ఈ సినిమాకీ చిరంజీవి `విజేత` చిత్రానికీ పోలికలున్నాయన్నది టాలీవుడ్ టాక్. విజేత గుర్తుంది కదా? అల్లర చిల్లరగా తిరిగే ఇంటి చిన్న కొడుకు ఆ ఇంటి బాధ్యత అంతా తన భుజాన వేసుకొని, చెల్లాయి పెళ్లి జరిపిస్తాడు. అందుకోసం తన లక్ష్యాన్ని పణంగా పెట్టి కిడ్నీని సైతం అమ్మేసుకొంటాడు. ‘జవాన్’ కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుందట. అయితే కిడ్నీని అమ్ముకోవడం లాంటి భారీ త్యాగాల జోలికి వెళ్లకుండా.. దాన్నీ ఎంటర్టైన్ మెంట్ వేలోనే చెప్పే ప్రయత్నం చేశారట.
మెగా హీరోలందరికీ `విజేత` రీమేక్‌పై మనసైంది. చరణ్ చాలా సందర్భల్లో `విజేత` రీమేక్ విషయం ప్రస్తావించాడు. అయితే… ఆ కథని ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు తీస్తే.. చూడ్డానికి జనాలు సిద్ధంగా ఉండకపోవొచ్చు. చరణ్ ఇమేజ్ దృష్ట్యా ఆ కథ కూడా నప్పకపోవొచ్చు. అందుకే ఆ కథని వీలైనంత వరకూ మార్చుకోవాలి. అలా చేస్తే.. విజేతలోని ఫ్లేవర్ దెబ్బతింటుంది. అందుకే చరణ్ `విజేత` జోలికి వెళ్లలేదు. సేమ్ అలాంటి ఫ్లేవర్ ఉన్న కథతో బివిఎస్ రవి… సాయిధరమ్‌ని సంప్రదించాడట. నిజానికి ఈ సినిమా ముందు దిల్‌రాజు బ్యానర్లో తీయాలనుకొన్నారు. అయితే.. దిల్‌రాజు కమిట్మెంట్స్ వల్ల.. ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టాడు. పైగా సాయిధరమ్ వరుసగా ఒకే బ్యానర్లో సినిమాలు చేయడం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. అందుకే… ఈ కథ దిల్ రాజు బ్యానర్ నుంచి పక్కకు వెళ్లినట్టు తెలుస్తోంది. బీవీఎస్‌రవి కూడా ”తన కుటుంబం కోసం పోరాడే ఓ మధ్యతరగతి యువకుడి కథ ఇది” అంటూ ఓ హింట్ కూడా ఇచ్చేశాడు. సో… ‘విజేత’ 2017 వెర్షన్ చూడ్డానికి మెగా అభిమానులంతా సిద్ధమైపోవాలన్నమాట.