మన కథానాయికలు చాలామంది సకళ కళా వల్లభునులే. నటన ఒక్కటే కాదు.. వివిధ అంశాల్లో వాళ్లకు ప్రమేయం ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్ లో వ్యాపార లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాజల్ కు డైమండ్ బిజినెస్ లో అనుభవం ఉంది. శ్రుతి అప్పుడప్పుడూ పెయింటింగ్ వేస్తుంటుంది. హన్సిక కూడా అంతే… బ్రెష్షు పడితే బొమ్మలు క్యూ కడతాయి. అలానే రాశీఖన్నాలోనూ ఓ టాలెంట్ ఉంది. తాను రాశీఖన్నా కవిత్వం బాగా రాస్తుందట. కవిత్వం రాయడం తన హాబీ అని… రాశీ చాలా సార్లు చెప్పింది. అయితే ఇప్పటి వరకూ ఒక్క కవిత కూడా వినిపించలేదు. త్వరలోనే ఆ భాగ్యం దక్కబోతోంది.
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా రాశీ ఖన్నా ఓ కవిత రాశిందట. దాన్ని ఓ వీడియోగా మలచి త్వరలోనే విడుదల చేయబోతోంది. రాశీ ఖన్నా కవిత్వం ఇంగ్లీష్ లోనే ఉండబోతోంది. దాన్ని తనే ఆలపిస్తూ ఓ వీడియో రూపొందించింది. అన్నట్టు రాశీఖన్నాలో మంచి గాయని కూడా ఉంది. ఇది వరకు ఓ సినిమాలో రాశీ పాట కూడా పాడేసింది. సో.. ఆ అనుభవంతోనే తన కవిత్వం తనే పాడుతూ.. వీడియోగా మలచిందన్నమాట. మరి ఈ కవిత్వం ఎలా ఉండబోతోందో? రాశీ ఖన్నా పెన్ను ఎంతలా పరవళ్లు తొక్కిందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.