ప్రివ్యూ టాక్‌: నేనోర‌కం… ఓ ర‌కంగా ఉంద‌ట‌!

143 సినిమాతో హీరో అయిపోయాడు పూరి త‌మ్ముడు సాయిరాం శంక‌ర్‌. బంప‌ర్ ఆఫ‌ర్ ఒక్క‌టే బాగా ఆడింది. దాని త‌ర‌వాత‌, అంత‌కు ముందూ అన్నీ ఫ్లాపులే. తేజ లాంటి దిగ్గ‌జంతో తీసిన వెయ్యి అబ‌ద్దాలు ఒక్క‌రోజు కూడా ఆడ‌లేదు. దాంతో… సాయి చాలా గ్యాప్ తీసుకొన్నాడు.. తీసుకోవాల్సివ‌చ్చింది కూడా. ఇంత‌కాలానికి ఓ సినిమా చేశాడు. అదే నేనో ర‌కం. పూరి జ‌గ‌న్నాథ్ సినిమా టెంప‌ర్‌కి ముందు అనుకొన్న టైటిల్ ఇది. అన్న‌య్య టైటిల్ త‌మ్ముడు వాడేసుకొన్నాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ… శంక‌ర్ న‌టించిన‌ ఏ సినిమాకి రానంత పాజిటీవ్ బ‌జ్ తీసుకొచ్చింది నేనోరకం. టైటిల్ క్యాచీగా ఉండ‌డం, శ‌ర‌త్‌కుమార్ లాంటి న‌టుడి అండ‌దండ‌లు ఉండ‌డం ఈ సినిమాకి క‌లిసొచ్చింది. ఇటీవ‌ల మీడియాకు ప్రివ్యూ షో కూడా వేశారు. చూసిన‌వాళ్లంతా పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. సెకండాఫ్ బాగుంద‌ని, శ‌ర‌త్ కుమార్ ఈ సినిమాని సింగిల్ హ్యాండ్‌తో త‌న వైపుకు తిప్పుకొన్నాడ‌న్న‌ది ప్ర‌స్తుతం వినిపిస్తున్న టాక్‌. ఓ సమ‌కాలీన స‌మ‌స్య‌ని ద‌ర్శ‌కుడు చాలా స‌మ‌ర్థ‌వంతంగా డీల్ చేశాడ‌ని, చూస్తుంటే… సాయిరాం శంక‌ర్ హిట్టు కొట్టేలానే ఉన్నాడ‌ని.. ఈవారం వ‌స్తున్న‌వ‌న్నీ చిన్న సినిమాలే కావ‌డం సాయికి క‌లిసొచ్చే విష‌య‌మ‌ని… ట్రేడ్ వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నాయి. మ‌రి.. పూరి త‌మ్ముడి నిరీక్ష‌ణ ఫ‌లించి అన్వేష‌ణ త‌గిన ఫ‌లితాన్ని ఇస్తుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close