ఏపీలో ఇదో వింత చ‌ట్టం రాబోతోందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఒక వింత చ‌ట్టం రూపొందించేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలో ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచేందుకు ప్ర‌భుత్వం కొన్ని కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దోమ‌ల‌పై దాడి అంటూ ఆ మ‌ధ్య ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కొన్ని ర్యాలీలు కూడా నిర్వ‌హించారు. దోమ‌ల బ్యాటులు ప‌ట్టుకుని ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. కొన్ని స‌భ‌లు కూడా నిర్వ‌హించారు. అయితే, ఇన్నాళ్లూ ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు ప్ర‌య‌త్నించిన ప్ర‌భుత్వం… ఇప్పుడు బాధ్య‌త పెంచాల‌ని అనుకుంటోంది. ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌పై బాధ్య‌త పెంచేందుకు ఓ చ‌ట్టాన్ని ప్ర‌తిపాదించ‌బోతున్నార‌ట‌. అదే.. దోమ‌ల చ‌ట్టం!

ఈ చ‌ట్టం ప్ర‌కారం దోమ‌ల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైన వారికి శిక్ష‌లు వేస్తారు. అవును.. దోమ‌ల్ని పెంచ‌డం ఇక‌పై నేర‌మే! అదేంటీ… దోమ‌ల పెంచ‌డ‌మేంటీ విడ్డూరంగా అనిపిస్తోంది. దోమ‌ల పెరుగుద‌ల‌కు అనువైన ప‌రిస్థితులు ఎవ‌రైనా క‌ల్పిస్తే.. వారికి ద‌శ‌ల‌వారీగా శిక్ష‌లు ఉంటాయ‌ట‌. ఇంటి ప‌రిస‌రాల్లో ప‌రిశుభ్ర‌త లేక‌పోతే.. మొద‌ట రూ. 25 వేలు జ‌రిమానా వేస్తార‌ట‌! రెండోసారీ అదే ప‌రిస్థితి ఉంటే రూ. 50 జ‌రిమానా..! రోడ్డుప‌క్క‌న వ్యాపారాలు చేసుకునే తోపుడు బండ్ల‌వారికి కూడా వాయింపు ఉంది. దోమ‌ల పెరుగుద‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం క‌ల్పించే తోపుడు బండ్ల య‌జ‌మానులకు రూ. 1000 చొప్పున జ‌రిమానా విధిస్తార‌ట‌. ఆ త‌రువాత‌, రోజుకి వంద చొప్పున జ‌రిమానా పెరుగుతూ పోతుంది.

ఇలాంటి చ‌ట్టం తీసుకుని వ‌స్తే ప‌రిస‌రాల‌న్నీ ప‌రిశుభ్రంగా ఉంటాయ‌నీ, దోమ‌లు లేకుండా పోతాయ‌ని చంద్ర‌బాబు స‌ర్కారు భావిస్తోంద‌ట‌. ఈ చ‌ట్టం ద్వారా ప్ర‌జ‌ల్లో బాధ్య‌త పెంచాల‌నుకుంటున్నార‌ట‌. ఈ ప్ర‌తిపాద‌న‌కు సంబంధించిన క‌థ‌నాలు మీడియాలో రాగానే సామాన్యులు మండిపడుతున్నారు. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచే బాధ్య‌త పంచాయ‌తీలు, మున్సిపాలిటీల‌ది క‌దా. ముందుగా వారి విధుల్ని వారు స‌క్ర‌మంగా నిర్వ‌హించే స‌గం స‌మ‌స్య‌లు పోతాయి. వారిపై ఒత్తిడి పెంచ‌కుండా, వారి విధి నిర్వ‌హ‌ణ‌పై నిఘా పెట్ట‌కుండా… దోమ‌ల‌పై దాడి పేరుతో సామాన్యుల‌పై ఈ జ‌రిమానాల బాదుడు ఏంటో అంటూ మండిప‌డుతున్నారు.

ఇప్ప‌టికే కొన్ని అంశాల్లో ప్ర‌భుత్వంపై తీరుపై చాలామంది ప్ర‌జ‌ల్లో విముఖత మొద‌లైంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి త‌ల‌తిక్క నిర్ణ‌యాలు, చ‌ట్టాలు తీసుకుని రావాల‌న్న ఆలోచ‌న ఎవ‌రిస్తున్నారో ఏంటో..? ఇలాంటి చ‌ట్టాల్ని ఆమోదించేముందు వాస్త‌వాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. సామాన్యుడు ఎలా స్పందించ‌బోతున్నాడ‌నేది కూడా ఒక్క‌సారి ఆలోచించాలి క‌దా! అనుకున్న‌దే త‌డువుగా ఇలాంటి చ‌ట్టాల్ని తీసుకొస్తే.. క‌ష్ట‌మే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వియ్యంకుడి తరఫున విక్టరీ వెంకటేష్ ప్రచారం..!!

లోక్ సభ ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ సినీ స్టార్లు కూడా ప్రచార పర్వంలోకి దూకుతున్నారు. తమ బంధువులను ఎన్నికల్లో గెట్టేక్కించేందుకు తమ వంతు పాత్ర పోషించాలని డిసైడ్ అయ్యారు. తాజాగా టాలీవుడ్...

బీఆర్ఎస్ ను పతనావస్తకు చేర్చుతున్న కేసీఆర్..!?

బీఆర్ఎస్ ఉనికికి పరీక్షలా మారిన లోక్ సభ ఎన్నికల్లో గులాబీ బాస్ ప్రసంగం పేలవంగా ఉంటుందా..? కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టకపోగా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపేలా ఆయన ప్రసంగం ఉంటుందా..? ...

కాంగ్రెస్ అలర్ట్…బీఆర్ఎస్ కోవర్టులపై యాక్షన్..!!

కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కుట్రలు చేస్తున్నారా..? గోప్యంగా ఉంచాల్సిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ కు చేరవేస్తున్నారా..? ఇరిగేషన్ , విద్యుత్ శాఖలో మాత్రమే కాకుండా ఇతర...

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close