చైర్మన్‌ ఎంపికతోనే క్యాబినెట్‌ కసరత్తు మొదలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌గా కాంగ్రెస్‌ నేత ఎ.చక్రపాణి స్థానంలోకి రావడానికి పోటీపడుతున్న తెలుగుదేశం నాయకుల పేర్లు తెలుగు360 ఇచ్చింది. వాస్తవానికి ఈ ఎంపికకు అంతకన్నా మించిన ప్రాధాన్యత వుంది. కౌన్సిల్‌ చైర్మన్‌గా ఎవరిని నియమిస్తారనేది నిర్ణయమైతే రేపు క్యాబినెట్‌ మార్పులు చేర్పులు మొదలైపోయినట్టే. సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, పయ్యావుల కేశవ్‌, గాలి ముద్దుకృష్ణమ నాయుడు,సతీష్‌ రెడ్డి వంటి వారి పేర్లు పరిశీలనలో వున్నాయి. ఇందులో సతీష్‌ రెడ్డి కొత్తవాడనే అభ్యంతరం వుంది. ఇక సోమిరెడ్డి,కేశవ్‌లు మంత్రులు కావాలని చూస్తున్నారు. కేశవ్‌ అయితే చైర్మన్‌ స్థానం వద్దని చెప్పినట్టు సమాచారం. ఆ స్తానంలోకి తీసుకునేవారి పేరు నిర్ణయమైతే సామాజిక సమీకరణాలు మారతాయి. మంత్రివర్గంలోనుంచి కొందరినైనా తప్పించడం అనివార్యం. అనేక వివాదాలు ఆరోపణల్లో వున్న రావెల కిశోర్‌బాబు పేరు తొలగింపుల జాబితాలో ముందుగా వుంది. పల్లె రఘునాథరెడ్డి/బొజ్జలగోపాల కృష్ణారెడ్డి ఎవరో ఒకరు వుండబోరని చెబుతున్నారు. దానివల్ల నష్టం కలగకుండా కొత్త నియామకాలుండాలి. ఇదంతా పెద్ద కసరత్తు.రావెల బదులు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పేరు చెబుతున్నారు గాని ఆయనకు ఇప్పటికే ఒక పదవి ఇచ్చారు. ఆ స్థానంలోమరెవరినైనా తీసుకుని డొక్కాను మంత్రిని చేస్తారని ఆయన అనుయాయులు అంటున్నారు. నారా లోకేశ్‌ ఎలాగూ రాబోతున్నారు. అఖిల ప్రియను కూడా తీసుకుంటారు. వైసీపీ నుంచి వచ్చి చేరిన మరో నలుగురి పేర్లు కూడా రౌండ్లు కొడుతున్నాయి గాని ఫిరాయింపుదార్ల చేర్పుపై గవర్నర్‌ అభ్యంతరం చెబితే ఎలా అని తర్కిస్తున్నారట. తెలంగాణలో లేని అభ్యంతరం ఇక్కడ ఎలా చెబుతారని మరికొందరు ఆక్షేపిస్తున్నారు. గవర్నర్‌కు అంతటి అధికారం లేదని కూడా వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా 2014 జూన్‌ 8న 20 మందితో ఏర్పడి ఇప్పటివరకూ యథాతథంగా కొనసాగుతున్న చంద్రబాబు మంత్రివర్గం పెద్ద మార్పులే చూడబోతుంది.ఇదేగాక మంత్రివర్గంలోవున్న లేని సూపర్‌ సీనియర్లకు సంబంధించి కూడా ఆసక్తికరమైన కబుర్లు వినిపిస్తున్నాయి.అవి మరోసారి….

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

కేసీఆర్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో...

లెట్స్ ఓట్ : బానిసలుగా ఉంటారా ? పాలకులుగానా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. అంటే ఓట్లేసే మనమే పాలకులం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించే మన ప్రతినిధులు అంటే.. మనం ఎన్నుకున్న పాలకులు.. తామే మహారాజులం అన్నట్లుగా పెత్తనం చేస్తారు. ఓ మాట...

HOT NEWS

css.php
[X] Close
[X] Close