ఫ్లాపులిచ్చినా… చిరు అభిమానం త‌గ్గ‌లేదు

మెగా ఫ్యామిలీకి బాగా కావ‌ల్సిన ద‌ర్శ‌కుల్లో శ్రీ‌నువైట్ల ఒక‌డు. చిరంజీవి అంటే… శ్రీ‌నువైట్ల‌కి అమిత‌మైన అభిమానం. ఆ ఇష్టంచూసే చిరు అప్ప‌ట్లో ‘అంద‌రివాడు’తో అవ‌కాశం ఇచ్చాడు.కానీ… ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. త‌న అభిమాన క‌థానాయ‌కుడ్ని డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చినా.. దాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు శ్రీ‌నువైట్ల‌. మొన్న‌టికి మొన్న బ్రూస్లీతో మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. కానీ… ఈసారీ శ్రీ‌నువైట్ల వ‌ర్క‌వుట్ కాలేదు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ రెండు ఫ్లాపులు ఇచ్చినా.. శ్రీ‌నువైట్ల‌పై చిరుకి అభిమానం త‌గ్గ‌లేదు. అందుకే మిస్ట‌ర్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో శ్రీ‌నుని వెన‌కేసుకొచ్చాడు.

అంద‌రివాడులో త‌మిద్ద‌రిమ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింద‌ని, బ్రూస్లీలో ఓ చిన్న పాత్ర ఇచ్చి త‌న‌ని అద్భుతంగా చూపించాడ‌ని పొగిడేశాడు. బ్రూస్లీలో చేసిన కామియో వ‌ల్లే మ‌ళ్లీ తాను కెమెరా ముందుకు రాగ‌ల‌న‌న్న న‌మ్మ‌కం క‌లిగింద‌ని చెప్పుకొచ్చాడు చిరంజీవి. సాధార‌ణంగా ఫ్లాపు ఇచ్చిన ద‌ర్శ‌కుల్ని హీరోలు ప‌క్క‌న పెడుతుంటాడు. అందులోనూ చిరు లాంటి క్లాలిక్లేటెడ్ వ్య‌క్తులు ఇంకానూ. కానీ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులిచ్చినా శ్రీ‌నుపై న‌మ్మ‌కం త‌గ్గ‌లేదు. చూస్తుంటే చిరు మ‌ళ్లీ పిలిచి ఓ ఆఫ‌ర్ క‌ట్ట‌బెట్టేట్టే క‌నిపిస్తున్నాడు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close