అలా పిలిస్తే ఇబ్బందిగా ఉంటోంది: వ‌రుణ్ తేజ్‌

మెగా హీరోల్లో వ‌రుణ్ తేజ్ స్టైల్ కాస్త డిఫ‌రెంట్ గా ఉంటుంది. అంద‌రిలా మాస్ సినిమాల్ని ఎంచుకోవ‌డం లేదు. సెన్పిబుల్ క‌థ‌లకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే ముకుంద‌, కంచెలాంటి సినిమాలు త‌న ఖాతాలో చేరాయి. అన్న‌ట్టు.. వ‌రుణ్ మెల్ల‌మెల్ల‌గా అభిమాన గ‌ణాన్ని పెంచుకొంటున్నాడు. ఫ్యాన్స్ కోసం ఆలోచిస్తున్నాడు. దానికి త‌గ్గ‌ట్టే ‘మెగా ప్రిన్స్‌’ అంటూ అభిమానులు కూడా త‌మ హీరోని ముద్దుగా పిలుచుకొంటున్నారు. అయితే ఇలా ప్ర‌త్యేకంగా ఓ బిరుదుతో పిల‌వ‌డం కాస్త ఇబ్బందిగా ఉంటోందంటున్నాడు వ‌రుణ్‌. ”అభిమానులు ఎలా పిలిచినా ఫ‌ర్వాలేదు. కానీ మెగాప్రిన్స్ అంటే ఇబ్బందిగా ఉంటోంది. మా త‌రం క‌థానాయ‌కులు ఇలాంటి బిరుదుల‌కు ప్రాముఖ్యత ఇవ్వ‌డం లేదు. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌, అమీర్ ఖాన్ లాంటివాళ్లకు కూడా బిరుదులు ఉన్నాయి. కానీ.. వాళ్లేం వాటిని త‌మ ప‌బ్లిసిటీలో వాడుకోరు. మ‌నం ఎందుకు వాడుకోవాలి” అంటున్నాడు.

ఒక్క సినిమా కూడా చేయ‌కుండా ‘మాకేం బిరుదులు ఇస్తారా’ అని ఎదురుచూసే హీరోలున్న ఈ త‌రుణంలో.. వ‌రుణ్ తేజ్ ఇలా మాట్లాడ‌డం ఆశ్చ‌ర్యంగానే ఉంది. వ‌రుణ్ న‌టించిన ‘మిస్ట‌ర్‌’ ఈ శుక్ర‌వారం విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాపై చాలా అశ‌లే పెంచుకొన్నాడు వ‌రుణ్‌ ఇందులో త‌న బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ కొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ట‌. ”శ్రీ‌నువైట్ల గారి గ‌త సినిమాల‌కంటే `మిస్ట‌ర్` చాలా కొత్త‌గా ఉంటుంది. ఆయ‌న త‌న తొలి రోజ‌ల్లో ‘ఆనందం’లాంటి అంద‌మైన ప్రేమ క‌థ తీశారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు అలాంటి ఓ ల‌వ్ స్టోరీ చెప్ప‌బోతున్నారు. ఈసినిమా త‌ప్ప‌కుండా మా అంద‌రి అంచ‌నాల్నీ నిజం చేస్తుంది” అంటున్నాడు వ‌రుణ్‌. శేఖ‌ర్ క‌మ్ముల‌తో తీసిన‌ ‘ఫిదా’ కూడా షూటింగ్ పూర్త‌యిపోయింద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమానీ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close