నలుపు-తెలుపు…పవన్ పైన కౌంటర్స్ పడుతున్నాయి

ఉత్తరాది-దక్షిణాది అని తనకే స్పష్టత లేని ఒక అంశాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు పవన్. దేశంలో ఇంకే సమస్యా లేదు అన్నట్టుగా ఆ నెగిటివ్ అంశంపైనే ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాడు. లేకపోతే జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఉత్తరాది-దక్షిణాది అనే కోణంలో చూస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? అసలు రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? అనే విషయాలపైన తల పండిన మేథావులు అందరూ కూడా ఎన్నో కారణాలు చెప్పారు. ఎంతో విశ్లేషించారు. కానీ పవన్‌కి మాత్రం ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజనకు కూడా ఉత్తరాది ఆధిపత్యమే కారణంగా కనిపిస్తోంది. ఓటకు నోటు కేసులో అడ్డంగా బుక్కయి తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను ఫణంగా పెట్టింది చంద్రబాబు అని అందరూ చెప్తున్నారు కానీ పవన్‌కి మాత్రం ఆ కోణం కనిపించదు. అలాగే ఉత్తరాది ఆధిపత్యం అని ఇప్పుడు ఈ రేంజ్‌లో రెచ్చిపోతున్న పవన్‌కి మూడేళ్ళ క్రితం ఆ విషయం తెలియదా? 2014 ఎన్నికల సమయంలో మోడీకి జై కొట్టండి, మోడీకి ఓటెయ్యండి అని చెప్పి ఉత్తరాదికి ఎందుకు జై కొట్టాడు? ఆంధ్రప్రదేశ్ అవసరాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటే దానికి కారణం చంద్రబాబు కాదా? తాజాగా పోలవరం నిధుల విషయంలో కూడా ఎపిని మోసం చేస్తూ నాలుక మడతేసింది మోడీ ప్రభుత్వం. ఆ విషయంతో తనకు సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు. కనీసం స్పందించిన పాపాన పోలేదు. కానీ పవన్ మాత్రం ఉత్తరాది-దక్షిణాది అంటూ ట్విట్టర్‌లో పాట పాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు.

బిజెపి నాయకుడి నలుపు-తెలుపు కామెంట్స్‌పై విరుచుకుపడిన పవన్ కామెంట్స్‌పై సినిమా ఇండస్ట్రీలో పవన్‌తో పెద్దగా పొసగని వ్యక్తులే ఇప్పుడు ఘాటుగా స్పందించారు. హీరోయిన్ అంటేనే తెల్లగా ఉండాలి. అలా తెల్లగా ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తారు అని జీవిత చెప్పుకొచ్చింది. ఈ విషయంలో పవన్ కూడా అతీతుడేమీ కాదు. అలాంటప్పుడు ఊరికే ట్విట్టర్‌లో ఆదర్శాలు వల్లిస్తూ కూర్చుకోవడం ఎందుకు? అలాగే డైరెక్టర్ తేజ కూడా ఈ తెలుపు-నలుపు గురించి కామెంట్స్ చేశాడు. ఇప్పుడు తెలుగులో ఉన్న టాప్ హీరోలు ఎవరైనా రంగు తక్కువ ఉన్న అమ్మాయిలను హీరోయిన్స్‌గా యాక్పెస్ట్ చేయగలరా అనే ప్రశ్నించాడు తేజ. విలువలు, సిద్ధాంతాలు, విధానాలను మనసా వాచా కర్మణా ఆచరిస్తేనే ఆ మనిషికి విలువ ఉంటుంది. అంతేకానీ కేవలం రాజకీయ మైలేజ్ కోసమో…మోడీతో ఎక్కడో చెడిందనో చెప్పి ఏకంగా భారతదేశ అస్తిత్వానికి సంబంధించిన అంశాన్నే వివాదాస్పదం చేయాలని చూస్తే మాత్రం పవన్ ఆలోచనా స్థాయినే అనుమానించాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close