ఇళ‌య‌రాజాకి ఝ‌ల‌క్ ఇచ్చాడు

‘నా పాట‌ల్ని ఎవ్వ‌రూ పాడుకోవ‌డానికి వీల్లేదు’ అంటూ.. ఇళ‌య‌రాజా న్యాయ స్థానం నుంచి ఓ స్టే ఆర్డ‌రు తెచ్చుకొన్నాడు. ఇళ‌య‌రాజా అంత‌టి వాడు… మ‌రీ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడేంటి? అంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇళ‌య‌రాజాది డ‌బ్బు వ్యామోహం అని కొంద‌రంటే, ఎస్‌.పి బాల సుబ్ర‌మ‌ణ్యం కూడా త‌క్కువ తిన‌లేద‌ని ఇంకొంత‌మంది మంది వాదించారు. ఇళ‌య‌రాజా ట్రూప్‌లో పాట‌లు పాడ‌డానికి బాలు ఎక్కువ మొత్తంలో డ‌బ్బులు డిమాండ్ చేశాడ‌ని, అందుకే బాలుకి చెక్ పెట్ట‌డానికి ఇళ‌య‌రాజా ఇలా వ్య‌వ‌హ‌రించాల్సివ‌చ్చింద‌ని చెప్పుకొన్నారు. మొత్తానికి ఎవ‌రి పాట‌పై ఎవ‌రికి హ‌క్కుంది? అనే విష‌యంలో పెద్ద ఎత్తున చ‌ర్చ మొద‌లైంది. రాయ‌ల్టీ పై వాదోప‌వాదాలు జోరందుకొన్నాయి. అయితే.. ఇప్పుడో యువ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌యరాజా స్టేట్‌మెంట్ కు విరుద్దంగా గ‌ళం ఎత్తాడు. ‘నా పాట‌లు ఎవ‌రైనా నిరభ్యంత‌రంగా పాడుకోవొచ్చు’ అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. త‌నే..మిక్కీ జే.మేయ‌ర్‌.

ఓ పాట‌ని ఎంత‌మంది, ఎన్ని ఎక్కువ సార్లు పాడితే.. అంత పాపులారిటీ వ‌స్తుంద‌న్న‌ది మిక్కీ లాజిక్‌. అదీ నిజ‌మే. నేను త‌ప్ప ఎవ్వ‌రూ పాడ‌కూడ‌దు అనుకొంటే, ఆ పాట‌ని సృష్టించ‌డం ఎందుకు?? అయితే మిక్కీకి రాయ‌ల్టీల‌పై ఎలాంటి అవ‌గాహ‌న లేద‌ట‌. ”ఓ పాట ఎవ‌రికి సొంతం అనే విష‌యాల్లో నాకు ఎలాంటి అవ‌గాహ‌న లేదు. ఆ అవ‌గాహ‌న కొద్దీ ఇళ‌య‌రాజా మాట్లాడి ఉంటారు. ఒక‌వేళ అందులోని లోటు పాట్లు నాకూ తెలిస్తే.. నేను వేరేలా స్పందించే వాడ్నేమో” అంటున్నాడు మిక్కీ. మొత్తానికి ఇళ‌య‌రాజా స్టేట్‌మెంట్ కు విరుద్ధంగా ఓ సంగీత ద‌ర్శ‌కుడు నోరు విప్పాడు. అదే సంతోషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close