ఫలించిన మాజీ సైనికుల ఆందోళన: ‘ఓఆర్ఓపీ’కి కేంద్రం ఆమోదం

హైదరాబాద్: ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ డిమాండ్‌తో మాజీ సైనికోద్యోగులు కొంతకాలంగా చేస్తున్న ఆందోళన ఎట్టకేలకు ఫలించింది. వారి ఆందోళనకు తలొగ్గిన కేంద్రప్రభుత్వం ఓఆర్ఓపీకి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర రక్షణశాఖమంత్రి పారికర్ ఈ మధ్యాహ్నం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయంవలన దేశ ఖజానాపై రు.8 వేలకోట్లనుంచి రు.10వేల కోట్ల వరకు భారం పడుతుందని మంత్రి చెప్పారు. రు. 500 కోట్ల భారమేనని గత ప్రభుత్వాలు అంచనా వేశాయని తెలిపారు. బడ్జెట్‌లో రు.500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఓఆర్ఓపీని ఐదేళ్ళకోసారి సమీక్షిస్తామని  తెలిపారు. రెండేళ్ళకొకసారి సమీక్షించమన్న మాజీ సైనికుల డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోలేదు. పెన్షన్‌లలో సమానత్వంపై ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తామని చెప్పారు. గత ఏడాది జులై 1 వ తేదీనుంచి దీనిని అమలు చేస్తామని, ఎరియర్స్‌ను నాలుగు అర్థ సంవత్సర వాయిదాలలో చెల్లిస్తామని, సైనికుల వితంతువులకు ఒకే వాయిదాలో చెల్లిస్తామని పారికర్ పేర్కొన్నారు.

కేంద్రం నిర్ణయంపై మాజీ సైనికోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ 40 ఏళ్ళ నిరీక్షణ ఫలించిందంటున్నారు. ఓఆర్ఓపీ కోసం మాజీ సైనికోద్యోగులు 82 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close