శిల్పా సోద‌రుల‌తో బాబు భేటీ కి కార‌ణం అదేనా..?

నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర‌మైన రాజ‌కీయ ప‌రిణామాల‌కు తెర లేచింద‌ని చెప్పారు. వైకాపా త‌ర‌ఫున గెలిచి, త‌రువాత టీడీపీలో చేరి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. దీంతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో శిల్పా మోహ‌న్ రెడ్డి ఈ ఉప ఎన్నిక‌పై ఆస‌క్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. టీడీపీ నుంచి త‌న‌కు టిక్కెట్టు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని ఆ వ‌ర్గం బాగానే ఆశ‌లు పెట్టుకుంది. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి వేరేలా మారుతోంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి మ‌రోసారి భూమా కుటుంబానికే అవ‌కాశం ఇవ్వబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి, భూమా మ‌ర‌ణించాక, ఆయ‌న కుమార్తెకు టీడీపీ స‌ర్కారు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. ఇప్పుడు రాబోయే ఉప ఎన్నిక‌లో కూడా ఆ కుటుంబానికే మ‌రో అవ‌కాశం ఇవ్వాల‌ని పార్టీ నిర్ణ‌యించిన‌ట్టు చాలారోజులుగా వినిపిస్తున్న‌దే.

దీంతో టీడీపీ నుంచి టిక్కెట్టు ఆశించిన మోహ‌న్ రెడ్డికి కాస్త నిరాశే ఎదురైంది. అయితే, ఈ అవ‌కాశాన్ని వైకాపా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు క‌దుపుతున్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చారు. వైకాపా త‌ర‌ఫున శిల్పా మోహ‌న్ రెడ్డికి నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఆఫ‌ర్ చేసిన‌ట్టు.. కొద్ది రోజుల్లో శిల్పా సోద‌రులు వైకాపా తీర్థం పుచ్చుకుంటార‌న్న‌ట్టుగా క‌థ‌నాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు శిల్పా సోద‌రుల‌తో భేటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి ద్వారా శిల్పా మోహ‌న్ రెడ్డికి చంద్ర‌బాబు కబురు పంపార‌ట‌. అలా వీరి భేటీ జ‌రిగింది. అయితే, ఇందులో ఏయే అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌న్న‌ది మాత్రం బ‌య‌ట‌కి తెలీదు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఎలాగూ భూమా ఫ్యామిలీకే టీడీపీ టిక్కెట్ ఇస్తుంది కాబ‌ట్టి, త‌న‌ను వైకాపా నుంచి పోటీకి దిగాల్సిందిగా కార్య‌క‌ర్త‌లూ మ‌ద్ద‌తుదారులూ ఒత్తిడి తెస్తున్నారంటూ మోహ‌న్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం. మ‌రి, ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య జ‌రిగిన భేటీ ఎలా ఫ‌లిస్తుంద‌నేది వేచి చూడాలి. టీడీపీతో కాస్త స‌ర్దుబాటు చేసుకుని, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కూ భూమా సోద‌రులు సైలెంట్ గా ఉంటారా..? లేదంటే, వైకాపాలో చేరి పోటీకి దిగుతారా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వైకాపా వ‌ర్గాలు కూడా శిల్పా మోహ‌న్ కి టిక్కెట్ ఇచ్చి, నంద్యాల బ‌రిలోకి దింపాల‌నే తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబుతో భేటీ అనంత‌రం శిల్పా సోద‌రుల ప్ర‌స్థానం ఎలా ఉంటుందో వేచి చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close