బుచ్చ‌య్య చౌద‌రి ఇంకా అల‌క వీడ‌లేదా..!

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌నయుడు లోకేష్‌.. ఇప్పుడు ఏపీ మంత్రి. ఆయ‌న్ని మంత్రిగా చూడాల‌నీ, ప్ర‌భుత్వంలో కీల‌క వ్య‌క్తిగా మారాల‌ని ఎంతోమంది టీడీపీ నేత‌లు ఆశించిన సంగ‌తి తెలిసిందే! తాజా విస్త‌ర‌ణ‌లో ఆ నేత‌ల కోరిక‌లు తీరాయి. మంత్రి అయ్యాక నారా లోకేష్ ఏ తీరున ప‌ని చేస్తున్నారో, ఎంత చురుగ్గా ముందుకు సాగుతున్నారో, త‌న‌కు సంబంధం లేని శాఖ‌ల విష‌యంలో కూడా ఎంత చొర‌వ‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారో అనేది మీడియాలో క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. ఏదేమైనా, మంత్రి హోదాలో లోకేష్ ఎక్క‌డికి వెళ్లిన బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేందుకు టీడీపీ కేడ‌ర్ సిద్ధంగా ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ, మంత్రి అయ్యాక తొలిసారిగా తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన లోకేష్ కి చుక్కెదురైంది..!

రాజ‌కీయంగా తూర్పు గోదావ‌రి జిల్లా ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న‌ది. సో.. మంత్రి అయ్యాక ముఖ్య‌మంత్రి కుమారుడు జిల్లాకి వ‌స్తున్నారంటే స‌హ‌జంగానే స్థానిక నేత‌ల హ‌డావుడి కాస్త ఎక్కువ‌గానే ఉంది. లోకేష్ వ‌స్తున్నారంటూ జిల్లాకు చెందిన నాయ‌కులంద‌రూ రావ‌డం అనేది రొటీన్ జ‌రుగుతుంది. కానీ, లోకేష్ ప‌ర్య‌ట‌న‌ను సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప‌ట్టించుకోలేద‌ట‌! జిల్లాకు లోకేష్ వ‌స్తున్నార‌ని తెలిసినా కూడా చాలా లైట్ గా తీసుకున్నారు. ఇప్పుడీ అంశం పార్టీలో చ‌ర్చ‌నీయంగా మారిన‌ట్టు స‌మాచారం.

ఇంత‌కీ.. ఆయ‌న లోకేష్ ప‌ర్య‌ట‌న‌కు రాక‌పోవ‌డం వెన‌క కార‌ణం.. చంద్ర‌బాబు నాయుడుపై అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డమే! ఫిరాయింపుదారుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చాక బుచ్చ‌య్య చౌద‌రి స్పందించిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడుకి సుదీర్ఘంగా ఒక లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ద్వారా బుజ్జ‌గింపు ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి. అయినా, బుచ్చ‌య్య చౌద‌రి ఆగ్ర‌హం చ‌ల్లార‌లేద‌నే చెప్పాలి. చిన‌బాబు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా దాన్ని మ‌రోసారి ఇలా బ‌య‌ట‌పెట్టార‌ని చెప్పాలి.

టీడీపీలో చాలా సీనియ‌ర్ నేత బుచ్చయ్య చౌద‌రి. తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ తో క‌లిసి ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌ది. దీంతో తాజాగా టీడీపీలో చోటు చేసుకుంటున్న ఫిరాయింపు రాజ‌కీయాల‌పై ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ప‌రిణామాల‌ను జీర్ణించుకోలేక‌పోతున్నారు. సో.. అసంతృప్తి అంతా ఇలా నారా లోకేష్ ప‌ర్య‌ట‌న‌పై ప‌డింద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close