అంద‌రికీ శ‌కునం చెప్పి కుడితెలో ప‌డ్డ కేజ్రీవాల్‌

చీపురుతో అవినీతిని తుడిచేస్తానంటూ రాజ‌కీయాల్లోకొచ్చిన అర‌వింద్ కేజ్రీవాల్ స్వ‌యంగా అవినీతి ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మంచి నీటిని స‌ర‌ఫ‌రా చేసే ట్యాంక‌ర్ య‌జ‌మానుల నుంచి రెండున్న‌ర కోట్ల రూపాయ‌లు లంచంగా స్వీక‌రించార‌నేది ఆరోప‌ణ‌. మామూలు ప‌రిస్థితుల్లో దీన్ని ఎవ‌రూ అంగీక‌రించరు.. ఆమోదించ‌రూ.. అవినీతికి ఆమ‌డ దూరంలో ఉంటామంటూ అధికారంలోకి వ‌చ్చిన ఆప్ అధ్య‌క్షుడు అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు స‌త్యేంద్ర జైన్ ఈ మొత్తాన్ని ఇస్తుండ‌గా క‌ళ్ళారా చూశాన‌ని మ‌రో మంత్రి క‌పిల్ శ‌ర్మ ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేసిన ద‌గ్గ‌ర్నుంచి రాజ‌ధానిలో క‌ల‌క‌లం మొద‌లైంది. అది త‌ప్ప‌ని ఖండించ‌క తప్ప‌ని ప‌రిస్థితి ఆప్‌కు ఎదురైంది. ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి దీనిని చ‌క్క‌దిద్దేందుకు రంగంలోకి దిగారు. మీడియా ముందుకొచ్చిన ఆయ‌న క‌పిల్ శ‌ర్మ ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వ‌ని చెప్పి నిష్క్ర‌మించారు. వేరే ఏ ప్ర‌శ్న‌కూ స‌మాధాన‌మీయ‌కుండా అంటే మీడియాను ఎదుర్కొన‌కుండానే ఆయ‌న వెళ్ళిపోవడం సందేహాల‌కు తావిస్తోంది.

అర‌వింద్ నిజంగానే లంచం తీసుకున్నారా. అస‌లాయ‌న లంచం తీసుకున్న నైజ‌మున్న వ్య‌క్తేనా అనే సందేహాలు ఢిల్లీ ప్ర‌జ‌ల‌లో అల‌ముకున్నాయి. ఇది కూడా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆడుతున్న నాట‌కం కాదు క‌దా అనే వాద‌నా మొద‌లైంది.

నిజం కాక‌పోతే కేజ్రీవాలే స్వ‌యంగా ఖండించ‌వ‌చ్చు క‌దా. ఎందుకు ఆయ‌న మీడియా ముందుకు రాలేద‌ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం లేదు. అంద‌రికీ శ‌కునం చెప్పే బ‌ల్లి తానే కుడితెలో ప‌డ్డ‌ట్టుగా కేజ్రీవాల్ ప‌రిస్థితి త‌యారైంది. ఈ స‌మ‌స్య నుంచి ఆయ‌నెలా బ‌య‌ట‌ప‌డ‌తార‌నేది ఆస‌క్తిక‌రం. త‌మిళ‌నాట రాజ‌కీయ నాట‌కాన్ని ర‌క్తిక‌ట్టించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్పుడు కేజ్రీవాల్ ప‌ని ప‌ట్టాల‌నుకుంటున్న‌ట్లు సుస్ప‌ష్ట‌మైపోయింది. ఎన్నో సార్లు కేజ్రీవాల్‌ను ఇరుకున పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించింది. ఇప్పుడు ల‌భించిన అస్త్రం తిరుగులేనిది. కేజ్రీవాల్ ద‌గ్గ‌ర స‌మాధానం లేనిదీనూ. ఆప్ మంత్రివ‌ర్గంలో తానొక్క‌డినే మ‌చ్చ‌లేనివాడిన‌ని క‌పిల్ శ‌ర్మ చెప్ప‌డం.. ఆయ‌న వెనుక బీజేపీ ఉంద‌నే అనుమానాల‌కు తావిస్తోంది. కొర‌క‌రాని కొయ్య‌లా త‌యారైన ఢిల్లీ ముఖ్య‌మంత్రిని జైలుకు పంపించ‌డానికి సైతం కేంద్రం సంశ‌యించ‌బోదు. కేజ్రీవాల్ నేరుగా ప్ర‌ధాన మంత్రినే ల‌క్ష్యంగా చేసుకుని ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆయ‌న డిగ్రీ కూడా న‌కిలీదేన‌ని నిరూపించ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఏదిఏమైనా రాజ‌కీయ య‌వ‌నిక‌పై ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు ద‌క్షిణాది త‌మిళ‌నాట నుంచి దేశ రాజ‌ధానికి బ‌దిలీ అయిన‌ట్లే క‌నిపిస్తోంది.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close