డ‌బ్బుల‌కి ప‌డిపోయాడు…దెబ్బ‌డిపోయింది

శ‌ర్వానంద్ జ‌డ్జ్‌మెంట్ పై అంద‌రికీ న‌మ్మ‌క‌మే. ర‌న్ రాజా ర‌న్ నుంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్లు కొట్ట‌క ముందే.. క‌థ‌ల విష‌యంలో తాను ఎంత ప‌క్కాగా ఉంటాడో అంద‌రికీ అర్థ‌మైంది. వేర్వేరు కార‌ణాల వ‌ల్ల శ‌ర్వానంద్ ఫ్లాపులు చ‌వి చూశాడు గానీ, క‌థ‌ల ఎంపిక‌లో మాత్రం ఎప్పుడూ త‌ప్పు చేయ‌లేదు. త‌న ప‌రిధి మేర‌.. బ‌ల‌మైన క‌థ‌లనే ఎంచుకొన్నాడు. ఈమ‌ధ్య సాధించిన క‌మర్షియ‌ల్ విజ‌యాల‌తో హిట్ హీరోగా నిల‌బ‌డిపోయాడు. రాజ్‌త‌రుణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌లు ప‌క్క‌న పెట్టిన ‘శ‌త‌మానం భ‌వ‌తి’ క‌థ‌ని న‌మ్మి.. ‘ఓకే’ చేశాడు. దానికి త‌గ్గ ఫ‌లితం సాధించాడు. శ‌ర్వా జ‌డ్జ్‌మెంట్ ఎంత క‌రెక్ట్ గా ఉంటుందో, తాను ఎంచుకొన్న క‌థ‌ల్ని, వెన్నుత‌ట్టిన ద‌ర్శ‌కుల్ని చూస్తే అర్థం అవుతుంది. అలాంటిది.. రాధ విష‌యంలో చాలా పెద్ద త‌ప్పు చేశాడు శ‌ర్వా.

రాధ టైటిల్‌, ట్రైల‌ర్‌.. అన్నీ ఆక‌ట్టుకొన్నాయి. శ‌ర్వా మ‌రో హిట్ కొట్ట‌డం ఖాయం అనిపించింది. అదే ఆశ‌తో థియేట‌ర్లోకి అడుగుపెడితే… నాలుగైదు స‌న్నివేశాల‌కే క‌ళ్లు బైర్లు క‌మ్మాయి. `ఏ పాయింట్ న‌చ్చి శ‌ర్వా ఈ క‌థ‌ని ఓకే చేశాడు` అనే విష‌యం జుత్తు పీక్కున్నా అర్థం కాలేదు. కొత్త క‌థ‌ల్ని ఎంచుకొనే శ‌ర్వా… మ‌రీ ఇంత రొటీన్ క‌థ‌కి ఓకే చెబుతాడ‌ని అస్స‌లు ఊహించ‌లేదు. దీని వెనుక‌.. నిర్మాతల బ‌ల‌వంత‌మే ప్ర‌ధాన కార‌ణం అనే మాట‌లు వినిపిస్తున్నాయి. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ద‌గ్గ‌ర రెండేళ్ల క్రిత‌మే అడ్వాన్స్ తీసుకొన్నాడు శ‌ర్వా. మ‌ధ్య‌లో ‘రాధ‌’ క‌థ‌ని ప‌క్క‌న పెట్టి ‘శ‌త‌మానం భ‌వ‌తి’ కూడా చేశాడు. పారితోషికం భారీగా ఇవ్వ‌డం, మొత్త‌మంతా సింగిల్ పేమెంట్‌తో సెటిల్ చేయ‌డం, బీవీఎస్ఎన్‌ప్ర‌సాద్ ఖాతాలో అత్తారింటికి దారేది లాంటి భారీ విజ‌యం ఉండ‌డం, ఆయ‌న ప్ర‌మోష‌న్లు బాగా చేస్తార‌ని న‌మ్మ‌డంతో శ‌ర్వా ఈ క‌థ‌కి ఓకే చెప్పాడు. అయితే.. రిజ‌ల్ట్ మాత్రం శ‌ర్వాని బాగా నిరాశ ప‌రిచింది. క‌థ విష‌యంలో ఇంకెప్పుడూ మొహ‌మాట‌ప‌డ‌కూడ‌ద‌ని ‘రాధ‌’ గీతోప‌దేశం చేసిన‌ట్టైంది. ఈ త‌ప్పు నుంచి శ‌ర్వా త్వ‌ర‌గా పాఠాలు నేర్చుకొంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .....

ప్రశ్నించిన మహిళ చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ అభ్యర్ధి

ఫించన్ రావడం లేదని నిలదీసిన ఉపాధి కూలీ మహిళ చెంప చెల్లుమనిపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. శుక్రవారం నిజామాబాద్ జిల్లా గోవింద్ పేట్ , చేపూర్, పిప్రి గ్రామాల్లో...

ఓటేస్తున్నారా ? : లా అండ్ ఆర్డర్‌ను గుర్తు చేసుకోండి !

రాష్ట్రంలో ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వడం అనేది ప్రభుత్వాలు ప్రజలకు కల్పించిన మొదటి సౌకర్యం. కానీ గత ఐదేళ్లుగా ఏపీలో ఎప్పుడైనా శాంతిభద్రతలు ఉన్నాయా?. పోనీ ప్రజలు నిర్భయంగా బతగలిగారా ?. పోనీ...

కళ్ల ముందు ఓటమి – వాస్తు మార్పులతో జగన్ ప్రయత్నం !

అభ్యర్థులను మార్చారు వర్కవుట్ అవలేదు. బస్సు యాత్ర పేరుతో తనను తాను మార్చుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు వర్కవుట్ అవ్వలేదు.. ప్రజలు మార్పు చేయడానికి సిద్ధమయ్యారని స్పష్టత రావడంతో చివరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close