ఎన్టీఆర్ మూడు పాత్ర‌లూ ఇవే!

ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం పోషిస్తున్న చిత్రం ‘జై ల‌వ‌కుశ‌’. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈనెల 19న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతోంది చిత్ర‌బృందం. ఈలోగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం వెలుగులోకి వ‌చ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేయ‌బోయే మూడు పాత్ర‌లేమిటో క్లూ దొరికేసింది. ఓపాత్ర‌లో బ్యాంకు ఉద్యోగిగా క‌నిపించ‌బోతున్నాడు ఎన్టీఆర్‌. మ‌రో పాత్ర దొంగ‌. మూడో పాత్ర ప‌ర్‌ఫెక్ట్ విల‌న్‌. ఈ మూడు పాత్ర‌ల‌కూ ఉన్న లింకేమిట‌న్న‌ది వెండి తెర‌పై చూడాల్సిందే. ఎన్టీఆర్ క్లాసిక‌ల్ డాన్స‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ని ఓ వార్త జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అదంతా రూమ‌రే. ఎన్టీఆర్ చేయ‌బోయే మూడు పాత్ర‌ల్లో క్లాసిక‌ల్ డాన్స‌ర్ పాత్రే లేదు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

అలీ ఎక్క‌డ‌.. క‌నిపించ‌డే?

టీడీపీ, జ‌న‌సేన నుంచి సీటు ఆశించి భంగ‌ప‌డి, వైకాపా గూటికి చేరిన‌వాళ్ల‌లో అలీ ఒక‌డు. కేవ‌లం వైకాపా త‌న‌కు సీటు ఇస్తుంద‌న్న కార‌ణంతోనే స్నేహితుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కూడా దూషించే సాహ‌సానికి ఒడిగ‌ట్టాడు...

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close