ఆనందోత్తుంగ త‌రంగలా ఏపీలో హ్యాపీనెస్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా ఖుషీలో ఓ డైలాగ్ ఉంది.. ఎంత ఆనందంగా ఉన్నానో.. ఎంత ఉల్లాసంగా ఉన్నానో అంటూ… ప్ర‌స్తుతం ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఇదే స్థితిలో ఉండుంటారు. నిన్న‌టికి నిన్న అమ‌రావ‌తిపై సింగ‌పూర్ ఇచ్చిన హామీ ఆ మ‌రుస‌టి రోజునే వ‌ర‌ల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఫ‌లితాల‌లో ఆంధ్ర ప్ర‌దేశ్‌కు భార‌త దేశం కంటే మెరుగైన ర్యాంకు వ‌చ్చింద‌ని తెలియ‌డం.. ఇది చాల‌దా.. ఆయ‌న ఆనందోత్సాహాల్లో తేలియాడ‌డానికి. ప్ర‌పంచ సంతోష సూచిక‌లో న‌వ్యాంధ్ర‌కు 72 వ ర్యాంకు వ‌చ్చింది అదే భార‌త దేశం పాపం 122వ ర్యాంకుతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. దేశంలోకంటే రాష్ట్రంలో సంతోష స్థాయి అత్య‌ధికంగా ఉంద‌ని తేల‌డాన్ని మించిన ఆనంద ముఖ్య‌మంత్రిగారికి ఏముంటుంది. నాయుడుగారి కుటుంబం సినిమాలో మాదిరిగా రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ సంతోషాతిరేకాల్ని ప్ర‌ద‌ర్శించి, ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాల్సిన రోజిది. అదృష్ట‌మో దుర‌దృష్ట‌మో గానీ మూత్రపిండ‌వ్యాధుల‌తో విల‌విల‌లాడుతున్న ఉద్దానం ప్రాంత‌మున్న శ్రీ‌కాకుళం ప‌ట్ట‌లేని సంతోషంతో ఉప్పొంగిపోతోంద‌ట‌. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆ జిల్లాకు మొద‌టి స్థానం వ‌చ్చిది. ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వంటి గౌర‌వ‌నీయులున్న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు రెండో స్థానం ద‌క్క‌గా.. పాపం ప్ర‌కాశం జిల్లా అట్ట‌డుగుస్థానంలో నిలిచింది.

155 దేశాలలో చేసిన అధ్యయనం 2017 వరల్డ్ హ్యాపీనెస్ నివేదిక‌ను ఐక్యరాజ్య‌స‌మితి వెలువరించింది. సంతోష సూచికలో పాకిస్థాన్ 80వ ర్యాంకు, భూటాన్ 97వ ర్యాంకు, నేపాల్ 99 వ ర్యాంకు, బంగ్లాదేశ్ 110 వ ర్యాంకు, శ్రీలంక 120 ర్యాంకు పొందాయి. జాతీయస్థాయిలో ఏపీ మెరుపులు మెరిపించింది. ఆంధ్రప్రదేశ్ సాధించిన హ్యాపీనెస్ స్కోర్ 5,368. భారత్ స్కోర్ కేవ‌లం 4,315. ఏపీ 5,273 స్కోరుతో ఉన్న చైనాను. 5,269 స్కోరు సాధించిన పాకిస్థాన్‌ను, 5,011 స్కోరు వచ్చిన భూటాన్‌ను, 4,962 స్కోరుతో ఉన్న నేపాల్ కంటే మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌ను చూపింది.

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప‌ని దీనికి ద‌ర్ప‌ణ‌మా అన్నంత స్థాయిలో ఈ నివేదిక ఉంది. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోని 3 అత్యుత్తమ రాష్ట్ట్రాల్లో ఒకటిగానూ, 2029 నాటికి దేశంలోనే నెంబర్-1 రాష్ట్రంగానూ రూపొందించ‌డం అంత క‌ష్ట‌మేం కాక‌పోవ‌చ్చు.

మన రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రజల సంతోషాన్ని, సంక్షేమ స్థాయులను కొలమానంగా సర్వే నిర్వ‌హించారు.

ఇందుకు ఐక్యరాజ్యసమితి, ఆర్గ‌నైజేష‌న్ ఫ‌ర్ ఎక‌న‌మిక్ కో ఆప‌రేష‌న్‌, డెవ‌ల‌ప్‌మెంట్‌, ప్ర‌పంచ బ్యాంకు వంటి సంస్థలు నిర్దేశించిన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2012లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ-జనరల్ బాన్‌కీమూన్ సుస్థిర అభివృద్ధి పరిష్కారాల వ్యవస్థను ప్రారంభించారు. సుస్థిర అభివృద్ధి సాధనలో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల రూపకల్పన, అమలుకు ఆచరణలో ఎదుర‌వుతున్న‌ సమస్యలకు సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడానికే ఎస్‌డిఎస్ఎన్‌ను ఏర్పాటుచేశారు. అప్ప‌టి నుంచి ఏటా ఈ నివేదికను వెల్ల‌డిస్తోంది. ఈ అధ్యయనానికి తీసుకున్న కొల‌మానాల‌నే ప్రాతిపదికగా తీసుకుని దేశ సగటుతో, ప్రపంచ దేశాల ర్యాంకింగ్స్‌తో పోల్చి ఆంధ్రప్రదేశ్‌లో సంతోష స్థాయులను (హ్యాపీనెస్ లెవెల్స్) అంచనా వేశారు. దేశంలో ప్రజా సంతోష సూచిక నిర్థారణకు విశ్వస్థాయి పద్ధతులను అనుసరించి ఫలితాలను రాబట్టిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.

హ్యాపీనెస్ ఇండెక్స్ అంచనాకు జనాభా ప్రాతిపదికన ఒక్కో దేశంలో 1000 మందిని ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేశారు. ఈ పద్ధతిలో మన రాష్ట్రంలో 13 జిల్లాలలో 17,800 మంది జీవన ప్రమాణాలపై ప‌రిశీలించారు. అసంపూర్తిగా వచ్చిన స్పందనలు, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించి (పేరు, వయసు, విద్య, స్టేటస్, డేటా ఎంట్రీ, టైమ్) మొత్తం 16,159 పరిపూర్ణ స్పందనలు వచ్చిన ఎంట్రీలను పరిశీలించారు.

ఏపీలో శ్రీ‌కాకుళానికి 6.414, పశ్చిమ గోదావరికి 6.067, కృష్ణా జిల్లాకు 5.764, నెల్లూరుకు 5.720, తూర్పు గోదావరికి 5.672, గుంటూరుకు 5.515, విజయనగరానికి 5.370, ఆంధ్రప్రదేశ్ 5.368, విశాఖపట్నానికి 5.053, అనంతపురానికి 4.966, కడపకు 4.867, కర్నూలుకు 4.775, చిత్తూరుకు 4.751, ప్రకాశానికి 4.679 స్కోర్లు ల‌భించాయి.

ఏపీకి హ్యాపీనెస్ ఇండెక్స్‌లో అత్యుత్త‌మ స్థానం ల‌భించ‌డం ఆనంద‌దాయ‌క‌మే. కానీ.. దేశంలోనే ఆదాయంలో నెంబ‌ర్ 1 రాష్ట్రంగా ఉన్న తెలంగాణ‌కు ఈ జాబితాలో స్థాన‌మే ద‌క్క‌క‌పోవ‌డం విచిత్ర‌మే. అధికారుల స్థాయిలోనే స‌ర్వేను పూర్తిచేసేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. క్షేత్ర‌స్థాయిలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను ఏ విధంగా బేరీజు వేశారో అంతుచిక్క‌ని అంశం. అదే స‌మ‌యంలో ఏపీ క‌ష్టాల్లో ఉంది. ఆదుకోవాల‌నంటూ ఎక్కే విమానం దిగే విమానంలా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కాలుకు బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతున్న త‌రుణంలో వ‌చ్చిన ఈ నివేదిక చంద్ర‌బాబు అండ్ కోకు మాత్ర‌మే సంతోష సూచిక‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close