బాబు ‘బాక్సైట్‌’ మాట అప్పుడొకటి ఇప్పుడొకటి

విశాఖజిల్లా ఏజెన్సీలో బాక్సైట్‌ ఖనిజతవ్వకం ఒప్పందాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిమాండ్ చేసిన ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే ప్రాజెక్టు రెండోదశకు అనుమతులు ఇచ్చే సన్నాహాలు ముమ్మరమయ్యాయి. అల్యూమినియం ఉత్పత్తులకు ముడి పదార్ధమైన బాక్సైట్‌ నిక్షేపాలు బాగావున్న ప్రాంతం కావడంతో ‘అన్ రాక్’ అనేసంస్ధ మాకవరం దగ్గర ఇప్పటికే అల్యుమినియం ఫ్యాక్టరీని నిర్మించింది.

గిరిజన ప్రాంతంలో సహజ వనరులు, అటవీ సంపద పరిరక్షణ, గిరిజనులకు రక్షణంగా ఉన్న 1/70, మొదలైన చట్టాలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా యధేచ్చగా ఉల్లంఘించి అప్పటి ప్రభుత్వం బాక్సైట్‌ ని ప్రయివేటు కంపెనీక ధారాదత్తం చేయడం మీద తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తింది. 2008 జూన్ లో బాక్సైట్‌ తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణలో..వామపక్షాలు, గిరిజన సంఘాలు బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించాయి. అయినా బాక్సైట్‌ తవ్వకాలకే అనుమతి లభించింది. అప్పటి ఒప్పందం ప్రకారం.. ఐటిడిఎ ద్వారా తవ్వకాలు చేపట్టాలి. అందుకు భిన్నంగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి) ద్వారానే తవ్వకాలు చేపట్టేలా మార్పులు జరుగుతున్నాయి. ఇందువల్ల తవ్వకాలపై గిరిజనులకు జవాబుదారీ తనంగా వుండే నియమం తెరమరుగైపోతుంది.

అన్‌రాక్‌ అల్యూమినా కంపెనీకి రెండోదశ గా చింతపల్లి బ్లాక్‌లోని జర్రెల ప్రాంతంలో 1,350 హెక్టార్లలో 248 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ను కట్టబెట్టేందుకు జరుగుతున్న ఏర్పాట్లే తవ్వకాలను ఎపిఎండిసి కి అప్పగించడానిక మూలమని గిరిజనులు అనుమానిస్తున్నారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద సొంత అవసరాల కోసం జెట్టీ నిర్మాణానికి అన్‌రాక్‌ అల్యూమినియం కంపెనీకి అనుమతి ఇచ్చినట్లు సిఎం చంద్రబాబు సోమవారం అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ఇది గిరిజనుల అనుమానాల్ని దృవపరుస్తోంది.

బాక్సైట్‌ ను ప్రయివేటు రంగానిక కట్టబెట్టరాదన్న ఉద్యమాన్ని సమర్ధించి, గిరిజనులను అండగా వున్న మావోయిస్టుల స్ధావరాలు ఇపుడు ఆప్రాంతాల్లో లేకపోయినప్పటికీ పోలీసు కేంపులు పెరిగిపోతూండటం గమనార్హం. తమ కంపెనీ వ్యవహారాలన్నిటినీ స్ధానికంగా సమన్వయం చేయడానిక ఒక రిటైర్డ్ పోలీస్ ఐజిని అన్ రాక్ నియమించకోవడం పెద్దవిశేషం.

ప్రతిపక్షనాయకుడిగా బాక్సైట్‌ ఒప్పందాలు రద్దుచేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రెండోదశ అనుమతులకు వేగంగా రంగం సిద్దమైపోతూండటం విచారకరం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close