ఔరంగజేబ్ రోడ్ .. సారీ, కలాం రోడ్

ఔరంగజేబ్ రోడ్ పేరును అబ్దుల్ కలాంరోడ్ అని మార్చడం సరైన నిర్ణయమేనా? ఔరంగజేబ్ ఎలాంటివాడు? కలాం ఎలాంటివారన్న వాదోపవాదాలకోసం కోసంకాదీ వ్యాసం. మంచిచెడ్డల ప్రస్తావన కాసేపు పక్కనబెట్టి ఆలోచిద్దాం. ఔరంగజేబ్ రోడ్డని ఎవరు ఎందుకుపెట్టారు? మరెవరు ఇప్పుడు ఆ పేరు పీకేసి కలాంపేరుగా మార్చారు? వీధులపేర్లు మార్చినంతమాత్రాన చరిత్ర కనుమరుగవుతుందా?

ఇండియా పేరుకూడా మార్చేస్తారా ?

ఊరన్నాక వీధులుంటాయి. వీధులన్నాక వాటికి పేర్లుంటాయి. ఆ వీధుల వెనుక కథలూ ఉంటాయి. అయితే వీధిపేర్లను చిటికీమాటికీ మార్చడం మంచిదేనా? ఆ మాటకొస్తే, ఊర్లపేర్లు మార్చేసే సంస్కృతి ఎక్కడినుంచి వచ్చింది ? మరి అలాంటప్పుడు ఇండియాను హిందూదేశం అని మారిస్తే తప్పేమిటనడిగితే ఎలాంటి సమస్యలుద్భవస్తాయో ఆలోచించారా? ఇవేవీ ఆలోచించకుండా ఢిల్లీలో ప్రముఖ రోడ్ పేరు మార్చేశారు.

ఢిల్లీలో ఔరంగజేబ్ రోడ్ అని చెబితేచాలు టాక్సీ డ్రైవర్ ఠక్కున తీసుకువెళతాడు. అదే ఏపీజే రోడ్ అనిచెబితే తత్తరపడవొచ్చు. నిజానికి ఔరంగజేబ్ రోడ్ పేరును డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం రోడ్ గా మార్చారు. ఒకవేళ పూర్తపేరు చెప్పినా టాక్సీడ్రైవర్ కు లైట్ వెలగకపోవచ్చు. పాపులరైన వీధిపేర్లను మార్చేటప్పుడు పాలకులు అనేక కోణాల్లో విశ్లేషించుకోవాలి. వాటిలో చారిత్రిక కోణం కూడా ఉంది.

ఔరంగజేబ్ టు కలాం

ఇద్దరు పోలికలేని వ్యక్తిత్వం కలిగినవారు. ఈ విభిన్న వ్యక్తులు ఢిల్లీలోని ఒకే రోడ్ ను పంచుకున్నారు. నిన్నమొన్నటిదాకా ఆ రోడ్ పేరు ఔరంగజేబ్ రోడ్ అయితే అదిప్పుడు కలాం రోడ్ గా మారిపోయింది.

ఢిల్లీలోని 1869 నుంచి 1944వరకు బ్రీటీష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటెన్స్ ఉండేవారు. బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఎన్నో భవననిర్మాణాలను స్వయంగా చూసుకున్నారు. అలాంటివాటిల్లోనే లూటెన్స్ బంగ్లా జోన్ (ఎల్ బి జెడ్) ఒకటి. ఆ ప్రాంతాన్ని లూటెన్స్ ఏరియా అనిపిలుస్తుంటారు. ఆ ప్రాంతంలోనే ఔరంగజేబ్ రోడ్ ఉంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం మరణానంతరం ఈ రోడ్డుని కలాం పేరుకు బదలాయించారు. పైకి చూసినప్పుడు ఇందులో తప్పేమీలేదని అనిపించవచ్చు. అబ్దుల్ కలాంపేరు విననివారుండరు. ఆయన ప్రజల రాష్ట్రపతిగా సుస్థిరస్థానం ఏర్పరచుకున్నారు. వివాదరహిత వ్యక్తి. ఎన్నో రంగాల్లో దేశం కోసం సేవలిందించిన మాననీయుడు. అలాంటి వ్యక్తి పేరిట ఒక వీధి ఉంటే ఎవ్వరూ తప్పుబట్టరు. నిజానికి వీధి పేరేంటి, ఏకంగా ఒక నగరం నిర్మించి దానికి ఆయనపేరు పెట్టినా తక్కువే అవుతుంది. అంతటి ప్రభావశాలి ఆయన. ఇప్పుడొచ్చిన సమస్య కలాం పేరు న్యూఢిల్లీ రోడ్డుకు ఎందుకు పెట్టారన్నదికానేకాదు, ఔరంగజేబ్ పేరును పీకేయడమే. ఏ వీధిపేరు లేనట్టుగా ఔరంగజేబ్ పేరే దొరికిందా వీరికి?

ఔరంగజేబుకీ, కలాంకు ఎక్కడా పోలికేలేదు. ఔరంగజేబ్ జీవనశైలి, ఆయన పరిపాలనా పద్ధతి మనలో చాలామందికి నచ్చకపోవచ్చు. ఆయన చాలామంది దృష్టిలో దుష్టుడుకావచ్చు. దుర్మార్గుడు అంతకంటే కావచ్చు. కానీ ఆయన ఒకప్పటి పాలకుడు. చక్రవర్తిగా ఉంటూ దేశాన్ని పాలించిన వ్యక్తి. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. పైగా కాలగర్భంలో కలిసిపోయిన జ్ఞాపకాలను మళ్ళీ ఇప్పుడు ఈ వీధిపేరుమార్పుతో పైకితీసినట్లయింది. అంతేకాదు, ఔరంగజేబ్ రోడ్ పేరును మార్చడంతో అనవసరంగా పాములపుట్టను కదిలించినట్లే అయింది. ఆగస్టు 28న న్యూఢిల్లీ మున్సిపాలిటీ కౌన్సిల్ (ఎన్ డి ఎంసీ) ఔరంగజేబ్ రోడ్డు పేరు మార్చాలన్న ప్రతిపాదనచేసింది. అందరివాడైన అబ్దుల్ కలాంపేరు పెడదామని అన్నప్పుడు అంతా తప్పట్లుకొట్టారు. `భేష్’ అంటూ మెచ్చుకున్నారు. కానీ, చరిత్రమూలాలు తెలియకపోవడంవల్లనే ఇలాంటి పొరపాట్లుచేస్తుంటారని ప్రముఖ చరిత్రకారుడు నారాయణి గుప్తా అంటున్నారు.

kalam road

బ్రిటీషర్లు పెట్టిన పేర్లు

దేశాన్ని మొఘలాయీలు పాలించినతర్వాత ఢిల్లీలోని ప్రధాన వీధులకు వారిపేర్లు పెట్టారు. బ్రిటీష్ పాలకులే పేర్లు ఖరారుచేశారప్పుడు. ఔరంగజేబ్, అక్బర్, షాజహాన్ వంటి మోఘల్ చక్రవర్తుల పేర్లను రోడ్లకు నామకరణంచేశారు. బ్రిటీష్ పాలకులు అప్పట్లో చాలా కసరత్తుచేసి చరిత్రకారుల సలహాలు తీసుకుని వీధులకు పేర్లు ఖరారుచేశారని చరిత్రచెబుతోంది. అశోక రోడ్డు అని పెట్టినా, లేదా కింగ్ జార్జ్ , క్వీన్ మారీ, వెలిస్లే అంటూ రోడ్లకు పేర్లుపెట్టినా వాటివెనుక చరిత్రమూలాలున్నాయి. ఏదో అడ్డదిడ్డంగా పెట్టినవికావవి. చరిత్రగుర్తుకువచ్చేలా పెట్టిన వీధిపేర్లను మార్చడం హర్షించేతగ్గవిషయంకాదు. పైపెచ్చు, చరిత్రను మరుగునపరిచే చర్యగా చెప్పుకునే ప్రమాదముంది. ఒక వీధికి అబ్దుల్ కలాంపేరును పెట్టడం తప్పేమీకాదు, కానీ చరిత్రతో ముడిపడిన వ్యక్తి పేరిట ఉన్న రోడ్డుకు పునర్నామకరణం చేయడమేమిటన్నదే ప్రశ్న. మరి అలాంటప్పుడు ఏం చేయాలి…?

1. కొత్తగా వేసే రోడ్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టుకోవచ్చు.

2. సైన్స్ మ్యూజియం వంటివాటికి పేరుపెట్టుకోవచ్చు.

3. భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే పరికరాలకు, యుద్ధ సామాగ్రికి ఆయన పేరుపెట్టుకోవచ్చు.

4. కొత్తగా నిర్మించే శాటిలైట్ టౌన్ షిప్ లకు ఆయన పేరు పెట్టుకోవచ్చు.

అంతేకానీ, ఇప్పటికే పాపులరైన ఔరంగజేబ్ రోడ్ సైన్ బోర్డ్ ను పీకేసి లేదా దానిపై కొత్త పెయింట్ వేసేసి డాక్టర్ అబ్దుల్ కలాం రోడ్ అనిరాయడం సరైన పద్ధతికాదని చరిత్రకారులంటున్నారు. ఇక్కడ ప్రశ్న ఔరంగజేబ్ వ్యక్తిత్వం, పాలనాపద్దతులు గురించికాదు, ఎన్నో ఆలోచించి బ్రిటీష్ రూలర్స్ తీసుకున్న నిర్ణయాన్ని, చరిత్రతో ముడిపడిన నిర్ణయాన్ని ఒక్క కలంపోటుతో తోసిపుచ్చేయడమేమిటన్నదే అసలు ప్రశ్న. ఇప్పుడు మనం పిలిచుకుంటున్న న్యూఢిల్లీకి రూపకల్పన చేసిన శిల్పి బ్రిటీష్ ఆర్కిటెక్ సర్ ఎడ్విన్ లాండ్సీర్ లూటెన్స్. సర్ హెర్బర్ట్ బాకెర్ సాయంతో ఆయన 1911-1931 మధ్యకాలంలో న్యూఢిల్లీ నగరాన్ని నిర్మించారు. ఇదంతా బ్రీటష్ కాలంలోనే జరిగిపోయింది.

స్వాతంత్ర్యం రాగానే…

మహాత్మాగాంధీ హత్యానంతరం, ఆ తర్వాత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణానంతరం దేశంలోని చాలాచోట్ల వీధులపేర్లు మారిపోయాయి. దేశరాజధానిలో కూడా అదేజరిగింది. బ్రిటీషర్ల పేర్లున్న వీధులను పునర్నామకరణంచేసేశారు. సరే, ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. కంటిన్యూ అవుతూనేఉంది. ఈ మధ్యకాలంలో నగరాలపేర్లను కూడా మార్చేస్తున్నారు. బొంబాయి ముంబయిగా మారిపోయింది. అలాగే కలకత్తానగరం కోల్ కతగానూ, మద్రాసు సిటీ చెన్నైగానూ మారిపోయాయి. మహారాష్ట్రలోని ఔరంగబాద్ నగరంపేరును కూడా మార్చాలన్న వాదన ముదిరింది. అదే జరిగితే నిజంగానే పాములపుట్టను కదిలించినట్టే అవుతుంది. ఔరంగజేబు చెడ్డవాడా, మంచివాడా అన్నది డిబేటబుల్ టాపిక్. ఎవరి కోణం వారిది. అదంతా అటుంచితే అతను మొఘల్ చక్రవర్తన్నది నిజం. ఈ సత్యాన్ని కొట్టిపారేయలేం. అలాంటప్పుడు ఆయనపేరిట ఉన్న పట్టణానికి పేరుమార్చేస్తామనడం ఏమేరకు సమంజసమో ఆలోచించాలి. అంతేకాదు, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోకూడా యోచించాలి. తొందరపాటున తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో అశాంతిని రేపకూడదు. నిర్ణయంతీసుకునేముందు సమగ్రమైన చర్చ అవసరం.

ఆగ్రాలో డుమ్మన్డ్ రోడ్ ఉండేది, కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ రోడ్ పేరును మహాత్మాగాంధీరోడ్ గా మార్చేశారు. అలాగే, ఢిల్లీలో కింగ్స్ వేను రాజపథ్ గానూ, `క్వీన్స్ వే’ను జనపథ్ గానూ, హార్డింగె ఎవెన్యూని తిలక్ మార్గ్ గానూ మార్చేశారు. కానీ ఒక్క విషయం మరిచారు. అదేమంటే, చరిత్ర ఎప్పటికీ చరిత్రే. అది తుడిచేస్తే పోయేదికాదు.

వీధులపేర్లు మార్చడంలో జరిగిందేదో జరిగిపోయింది. గతంగతః. ఇప్పటికైనా తెలివితెచ్చుకోవాలి. ఔరంగజేబ్ రోడ్ పేరును మార్చన తాజా ఉదంతంతోనైనా మనప్రవర్తనలో మార్పురావాలి. ఇదే ధోరణి కొనసాగితే జాఢ్యంగా మారే ప్రమాదంలేకపోలేదు. మరికొన్నితరాలు గడిస్తే చరిత్రను చీకటి కోణంలోకి నెట్టేసి కొత్తకొత్త పేర్లతో ఢిల్లీవీధులు నిండిపోతాయన్న ఆందోళన చరిత్రకారుల్లో కనబడుతోంది. ఎప్పటినుంచో అందరి నోర్లలో నలిగిన పేర్లను పెన్నుపోటుతో తీసేసినంతమాత్రాన వీధి మారిపోతుందా, వీధి చరిత్ర మారిపోతుందా లేక
ప్రజల మనసుల్లో పడిన ముద్ర చెరిగిపోతుందా? ఆలోచించాల్సిందే..

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close