సోమ‌వారం త్వ‌ర‌లో పోల‌వారం!!

సోమ‌వారం పేరు మారిపోనుందా. అవున‌నే అనిపిస్తోంది. మ‌హానాడు వేదిక‌గా నిన్న చంద్ర‌బాబు చేసిన ప్ర‌సంగం ఈ అభిప్రాయాన్నే క‌లిగిస్తోంది. అమ‌రావ‌తి, పోల‌వ‌రం ఇవే త‌న ఆకాంక్ష‌ల‌ని పేర్కొన్నారు. అవి పూర్త‌యితే రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుంద‌ని తెలిపారు. వారాల పేర్లలో మొద‌టిది సోమ‌వారం. పోల‌వ‌రం పూర్తికాగానే ఆ రోజుకు పోల‌వారంగా మారుస్తామ‌న్నారు. పోల‌వ‌రం పూర్త‌యితే వ‌చ్చేప్ర‌యోజ‌నాల‌ను వివ‌రిస్తూ, రాష్ట్ర భ‌విత‌ను మ‌లుపుతిప్పే ఆ ప్రాజెక్టు పేరిట వారం పేరు మారిపోతుంద‌న్నారు. త‌ను అనుకుంటున్న‌ట్లు వారం పేరును మారిస్తే… చంద్ర‌బాబు పేరు చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంది. మ‌హానాడు వేదిక‌పై నుంచి ఆయ‌న చేసిన ప్ర‌సంగంలో అధిక‌శాతం అభివృద్ధి ప‌నులపైనే మాట్లాడారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ప్ర‌తిప‌క్షంపై చుర‌క‌లేశారు. మూడు రోజుల మ‌హానాడులో చ‌ర్చ‌ను అభివృద్ధిపైనే కేంద్రీక‌రించి కొత్త శాస‌నాన్ని లిఖించారు చంద్ర‌బాబు.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close