కార్యకర్తల పునాదితోనే వారసుడికి నాయకత్వం!

తెలుగుదేశం భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ కి కనీసం లక్షమంది కార్యకర్తల మద్దతువుండేలా పార్టీ శిక్షణ మొదలుకాబోతోంది. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో, ఎన్ టి ఆర్ ఆవేశ ఉద్వేగాలనుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీని, నిర్వహణా సామర్ధ్యంతో దేశంలోనే పటిష్టవంతమైన నిర్మాణయంత్రాంగం వున్న పార్టీగా నారా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దారు. ఇపుడు నిరంతరాయ కార్యకర్తల శిక్షణ అనే విన్నూత్న కార్యక్రమం ద్వారా పార్టీ మూడోతరం వారసుడు లోకేష్ కు అపూర్వమైన కార్యకర్తల మద్దతు కూడకట్టే పని మొదలు పెడుతున్నారు.

”చినబాబు”కి పార్టీ బాధ్యతలు, ప్రభుత్వంలో బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రాభివృద్దిమీదే మరింత దృష్టి కేంద్రీకరించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆపార్టీ ముఖ్యులు, ముఖ్యంగా యువకార్యకర్తలు తరచుకోరుతున్నారు. అధికారబాధ్యతలు నెత్తికెత్తుకోడానికి ముందు లోకేష్, పార్టీలో లోతుగా పనిచేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ముందుగా ఆర్ధికాంశాలతో ముడిపడిన కార్యకర్తల సంక్షేమాన్ని చూసే ట్రస్ట్ బాధ్యతను లోకేష్ కు అప్పగించారు.

ఎన్ టి ఆర్ స్ధాపించిన తెలుగుదేశం కార్యక్తల సంఖ్య నాలుగులక్షలకు పైబడింది. సభ్యత్వం నమోదు మొదలు కార్యకర్తల శిక్షణ వరకూ పటిష్టంగా విసృ్తతంగా వున్న పార్టీ యంత్రాంగం తెలుగుదేశానికి తప్ప దేశంలో మరోపార్టీకిలేదు. ఎన్ టి ఆర్ హయాంలో పార్టీలో ప్రవేశించిన వారు క్రమంగా రిటైరైపోతున్నారు. చంద్రబాబు తో పూర్తిగా సర్దుబాటుచేసుకోలేక, రాజకీయాలను వదలలేక అంటీముట్టనట్టు పార్టీలో కొనసాగుతున్న కెఇ కృష్టమూర్తి మాదిరిగా సాగుతున్నవారిని వెళ్ళమీదే లెక్కపెట్టవచ్చు. ఎన్ టిఆర్ హయాంలో రాజకీయాలు మొదలు పెట్టి చంద్రబాబు జమానాలో కూడా హవానడుస్తున్న యనమల రామకృష్ణుడు, కోడెల శివప్రసాద్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి వంటివారు నాయకుడైన చంద్రబాబుకి అనుచరులమన్న మర్యాద ప్రకటిస్తున్నా నిజానికి వారు బాబు సహచరులే. వీరిని గౌరవిస్తూనే సర్వస్వతంత్రంగా వ్యవహరించడానికి చంద్రబాబు సొంత లేదా కొత్త అనుచరులైన నారాయణ, సుజనా చౌదరి, మొదలైనవారికి అధికార బాధ్యతలను కట్టబెట్టారు.

ఇపుడు చంద్రబాబు అనుచరులుగా సహచరులుగా వున్న నాయకులు అదే విధేయతను నారా లోకేష్ పట్ల చూపించడంలో పెద్ద ఇబ్బంది వయోబేధమే! అయితే క్రమంతప్పని తెలుగుదేశం సభ్యత్వాల నమోదు కొత్తతరం కార్యకర్తల్ని పార్టీలోకి తీసుకు వస్తుంది. ఫలితంగా విద్యవంతులు, వృత్తినిపుణులు అయిన యువకార్యకర్తలకు తెలుగుదేశంలో లోటులేదు. వీరందరికీ నిరంతరాయంగా సిద్ధాంతపరమైన శిక్షణ, యోగ్యతలను బట్టి వారినుంచి కొందరికి నాయకత్వ శిక్షణ ఇచ్చేలా తెలుగుదేశం కార్యక్రమాన్ని రూపొందించింది. ఈఫలితాలు నాలుగైదేళ్ళలో లోకేష్ కు తిరుగులేని మద్దతుగా నిలుస్తాయి.

సెప్టెంబరు 11వ నుండి ఎంపిక చేసిన కొందరు కార్యకర్తలకు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. 13 జిల్లాలకు చెందిన వారి ట్రెయినింగ్ కు తిరుపతి, కందుకూరు, తాడేపల్లి గూడెం, అరకులో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రంలోనూ వారానికి మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుంది. మూడు రోజుల్లో బ్యాచ్‌కు 100 మంది చొప్పున శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు జరిగాయి.అంటే, ప్రతీ కేంద్రంలోనూ వారానికి రెండు బ్యాచ్‌లు వేసుకుంటే రెండు వందల మందికి శిక్షణ ఇప్పిస్తారు. దాని ప్రకారం నాలుగు కేంద్రాల్లో కలిపి నెలకు 3200 మందికి శిక్షణ ఇస్తారు. ఈ విధంగా రాబోయే నాలుగేళ్ళలో పార్టీకి సుశిక్షితులైన సుమారు 1.5 లక్షల మంది కార్యకర్తలను తయారు చేసుకోవాలని నిర్ణయించారు. గ్రామ స్ధాయి నుండి మండల స్ధాయి వరకూ ఇప్పటి వరకూ చురుగ్గా, అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలను శిక్షణకు ఎంపిక చేస్తున్నారు.

మూడు రోజుల శిక్షణ తరగతుల్లో పార్టీ చరిత్ర, సాధించిన విజయాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించటం తదితర అంశాలుంటాయి. అంతే కాకుండా గడచిన ఏడాది కాలంలో అధికారపార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రూపొందిస్తున్న వివిధ కార్యక్రమాల ప్రచార విధానాలను కూడా తెలియజేస్తారు. పార్టీ, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి చేరవేయటం, గ్రామస్ధాయి నుండి పార్టీని పటిష్టం చేయటంలో భాగంగా సభ్యత్వ నమోదు చేయించటం కూడా ఇందులో భాగమేనని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా సుమారు లక్ష మందికి పార్టీ, ప్రభుత్వ విధానాలపై శిక్షణ ఇవ్వటం, వీరి ద్వారానే పార్టీ సభ్యత్వ నమోదును చేయించటమంటే, లోకేష్‌కు పార్టీలో బలమైన పునాదిని వేయటమేనని అర్ధమైపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close