తాత్కాలిక‌మే ఇలా ఉంటే.. శాశ్వ‌తం ఇంకెలానో!

అమ‌రావ‌తిలో వ‌ర్షం భారీ కురిసింది. దీంతో తాత్కాలిక‌ స‌చివాల‌యంలోకి నీరు వ‌చ్చి చేరింది. విప‌క్ష నేత జ‌గ‌న్ ఛాంబ‌ర్ లోకి నీళ్లొచ్చాయి. దీంతో ఈ అంశాన్ని వైకాపా తీవ్రంగా ప‌రిగ‌ణిస్తూ విమ‌ర్శ‌ల‌కు దిగింది. రాజ‌ధాని ప్రాంతంలో జ‌రుగుతున్న అవినీతికి ఇదే నిద‌ర్శ‌నమంటూ విప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. భారీ నిర్మాణాల‌కి ఆప్రాంతం అనుకూలంగా లేద‌ని ఎంత‌మంది చెప్పినా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పెడచెవిన పెట్టార‌ని వైకాపా శాస‌న మండ‌లి ప‌క్ష నేత ఉమారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు ఆరోపించారు. ఆ ప్రాంతంలోని కొండ‌వీటి వాగు వ‌ల్ల ముంపున‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని గ‌తంలో శివ‌రామ‌కృష్ణ క‌మిటీ చెప్పింద‌న్న‌ విష‌యాన్ని గుర్తుచేశారు. ఇక్క‌డ భారీ భ‌వ‌నాలు నిర్మించ‌కూడ‌ద‌ని గ్రీన్ ట్రైబ్యున‌ల్ కోర్టు చెప్పినా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న అన్నారు.

ఇంత‌కీ, తాత్కాలిక స‌చివాల‌యంలోకి నీరెలా చేరింద‌నే అంశంపై అధికారులు వెంట‌నే స్పందించారు. భ‌వ‌న నిర్మాణంలో ఎలాంటి నాణ్య‌తా లోపాలు లేవంటూ క‌మిష‌న‌ర్ శ్రీ‌ధ‌ర్ మీడియాతో చెప్పారు. వ‌ర్షం కురిసిన వెంట‌నే భ‌వ‌నాన్ని ఆయ‌న పరిశీలించారు. స‌న్ రూఫ్ లోకి నీరు వెళ్ల‌డం వ‌ల్ల‌నే అది భ‌వ‌నంలోకి లీక్ అయింద‌ని వివ‌రించారు. ఇక‌, జ‌గ‌న్ ఛాంబ‌ర్ విష‌యానికొస్తే.. ఈ మ‌ధ్య కొన్ని ఎల‌క్ట్రిక‌ల్‌ వ‌ర్క్స్ చేస్తున్నార‌నీ, వాటి కోసం ఒక ఇనుప పైపును దించార‌నీ, దాని పైభాగం ఓపెన్ గా ఉండ‌టంతో కొంత వ‌ర్ష‌పు నీరు దాని ద్వారా ఛాంబ‌ర్ లోకి ప్ర‌వేశించింద‌ని చెప్పారు. ఈదురుగాలులు భారీ రావ‌డం వ‌ల్ల‌నే స‌న్ రూఫ్ లోకి నీరు ప్ర‌వేశించింద‌నీ, ఈ అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని స‌న్ రూఫ్ వాలును త‌గ్గిస్తూ కొత్త డిజైన్లు ఇచ్చామ‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు.

అయితే, దాదాపు రూ. 700 కోట్ల‌తో తాత్కాలిక స‌చివాల‌య నిర్మాణం చేప‌ట్టారు. ఎప్ప‌టిక‌ప్పుడు డిజైన్లు మారుస్తూ వ‌చ్చారు. ఇప్పుడు స‌న్ రూఫ్ డిజైన్ మార్చాల‌ని అధికారులే చెబుతున్నారు. భారీ ఈదురుగాలులు వ‌స్తే ఇలాంటి ప‌రిస్థితి ఎదురౌతుంద‌ని ముందుగా అంచ‌నా వేయ‌లేక‌పోయారా అనేదే ఇక్క‌డ‌ ప్ర‌శ్న‌. తాత్కాలిక స‌చివాల‌యంలోని నీరు చేర‌డం వెన‌క నిర్మాణంలో నాణ్య‌తా లోపాలు లేక‌పోవ‌చ్చుగానీ.. నిర్వ‌హ‌ణ‌లో మాత్రం క‌నిపిస్తున్నాయి క‌దా! ఈ ఘ‌ట‌న చిన్న‌దే అయినా.. దీన్ని కాస్త సీరియ‌స్ గానే తీసుకోవాలి. లేదంటే, తాత్కాలిక స‌చివాల‌య నిర్వ‌హ‌ణే ఇలా ఉంటే… రేప్పొద్దున్న శాశ్వ‌త నిర్మాణాలు ఎలా ఉంటాయో అనే విమ‌ర్శ‌ను చంద్ర‌బాబు స‌ర్కారు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close