ట్రైల‌ర్ టాక్ : ‘నిన్ను కోరి’

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు నాని. త‌న మార్కెట్ రోజు రోజుకీ పెంచుకొంటూ వెళ్తున్నాడు.నాని నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా.. నిన్ను కోరి. నివేధా ధామ‌స్ క‌థానాయిక‌గా న‌టించింది. ఆది పినిశెట్టి కీల‌క పాత్ర పోషించాడు. ట్రైల‌ర్ ఈరోజే.. బ‌య‌ట‌కు వ‌దిలారు. ఓ ల‌వ్ స్టోరీ.. వినోదం.. బ్రేక‌ప్‌… విర‌హం… క‌థ ఇలా సాగ‌బోతోంద‌ని ట్రైల‌ర్‌లో తెలిసిపోతోంది. నాని టైమింగ్‌, జోవియ‌ల్ న‌ట‌న‌.. ట్రైల‌ర్‌లో మ‌రోసారి ప్ర‌స్పుటంగా క‌నిపిస్తోంది. ఇదో రొమాంటిక్ కామెడీ మూవీ.. ఎమోష‌న్లు కూడా బ‌లంగా ద‌ట్టించిన‌ట్టు అనిపిస్తోంది. `వ‌న్స‌పానె టైములో… వైజాగ్ బిచు రోడ్డులో` అనే పాట‌… కొంత‌కాలం వినేలా ఉంది. ఇప్ప‌టికే `నిన్ను కోరి` కోసం విడుద‌ల చేస్తున్న ఓ గీతం శ్రోతల్ని ఆక‌ట్టుకొంది. మొత్తానికి గోపీసుంద‌ర్‌ మ్యూజిక్ ఈ సినిమాకి బాగా ప్ల‌స్ అయ్యేలా క‌నిపిస్తోంది. ఆది పినిశెట్టి పాత్ర ఈ చిత్రంలో కీల‌కం కానుంది. ఆ పాత్ర పండింతే.. సినిమా హిట్టు గ్యారెంటీ. దానికి తోడు.. నాని ఓ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. `నీకు అర్థం అవుతోందా… నా గెలుపు ఆల్రెడీ మొద‌లైపోయింది` అన్న‌చోట నాని లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. సో… నాని నుంచి మ‌రో స‌క్సెస్ ఫుల్ ల‌వ్ స్టోరీ.. ఆశించేయొచ్చు. బీ రెడీ.

https://www.telugu360.com/ninnu-kori-trailer-breezy-romantic-ride/

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close