విక్ర‌మ్ కుమార్‌… కాపీ కొడ‌దామ‌నుకొన్నాడా?

ఈ వారం విడుద‌ల‌వుతున్న ఓ చిన్న సినిమా `రెండు రెళ్లు ఆరు`. ఈ సినిమా క‌థ కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఓ ఆసుప‌త్రిలో ఒకేసారి రెండు కాన్పులు జ‌రుగుతాయి. ఓచోట బాబు పుడితే, మ‌రో చోట అమ్మాయి పుడుతుంది. ఆ ఇద్ద‌రూ.. తారుమారు అవుతారు. వాళ్లే పెద్ద‌య్యాక ప్రేమ‌లో ప‌డ‌తారు. కొడుకు త‌న ఇంటికే అల్లుడిగా వ‌స్తాడు. కూతురు… త‌న ఇంటికి కోడ‌లుగా వెళ్తుంది. అదీ.. క‌థ‌. విక్ర‌మ్ కె.కుమార్ – అఖిల్‌ల కోసం అనుకొన్న స‌బ్జెక్ట్ కూడా అదే. స్క్రిప్టు పూర్త‌య్యేలోగా ఈ సినిమా ఆగిపోయింది. `రెండు రెళ్లు ఆరు`, అఖిల్ సినిమా క‌థ రెండూ ఒక‌టే అయిన‌ప్పుడు ఎవ‌రు ఎవ‌రిని కాపీ కొట్టాల‌ని చూశారు? అనే ప్ర‌శ్న ఉద్భ‌వించ‌డం త‌థ్యం.

ఈ ఎపిసోడ్‌లో మాత్రం ‘రెండు రెళ్లు ఆరు’ క‌థ‌నే విక్ర‌మ్ కె.కుమార్ కాపీ కొట్టాల‌ని చూశాడ‌ని తెలుస్తోంది. ‘రెండు రెళ్లు ఆరు’ క‌థ‌ని ఆ చిత్ర ద‌ర్శ‌కుడు చాలామందికి చెప్పాడు. అందులో ఒక‌రు.. విక్ర‌మ్‌కి స‌న్నిహితుడ‌ట‌. ఆ క‌థ‌ని విక్ర‌మ్ ద‌గ్గ‌ర లీక్ చేసి పాడేశాడు. ‘ఈ పాయింట్ ఏదో భ‌లే వుందే’ అనుకొన్న విక్ర‌మ్ దానికి సొంత తెలివి తేట‌లు జోడించి.. నాగ్‌కి వినిపించ‌డం, నాగ్ ఓకే చెప్ప‌డం జ‌రిగిపోయాయి. అయితే.. స‌ద‌రు సంగ‌తి తెలుసుకొన్న ‘రెండు రెళ్లు ఆరు’ టీమ్… విక్ర‌మ్‌ని నిల‌దీసింది. ”మా క‌థ ఆల్రెడీ రిజిస్ట‌ర్ అయిపోయింది. ఈ క‌థ‌తోనే సినిమా ఎలా తీస్తారు?” అని అడ‌గ‌డంతో… విక్ర‌మ్ త‌న త‌ప్పు తెలుసుకొని, ఆ స్క్రిప్టుని ప‌క్క‌న పెట్టేశాడు. అదీ.. విక్ర‌మ్ – అఖిల్ రెండు రెళ్లు ఆరు క‌థ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

ఎడిటర్స్ కామెంట్ : గుర్తుకొస్తున్నావయ్యా.. శేషన్ !

టీ.ఎన్.శేషన్. ఈ పేరు భారత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్మరించుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయనను మరిపించేలా మాత్రం ఎవరూ రావడం లేదు. ఎన్నికల సంఘం...

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

HOT NEWS

css.php
[X] Close
[X] Close