బిహార్ లో కమలవికాసం..ఇదో ఒపీనియన్

బిహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే అక్కడ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికిప్పుడు ఫలితాలను కచ్చితంగా లెక్కగట్టే పరిస్థితిలేకపోయినా, ప్రస్తుతానికి (సెప్టెంబర్ మొదటివారంనాటికి) అందిన ప్రజానాడి ప్రకారం అక్కడ ఈసారి బీజేపీ దాని అనుకూలపార్టీలు కలిసి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటాయని ప్రీపోల్ సర్వే ఒకటి తేల్చిచెప్పడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచాయి. 243 స్థానాలున్న అసెంబ్లీలో 122స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేవీలుంటుంది. అయితే బీజేపీ దాని మిత్రపక్షాలు కలిపి మరో మూడు అదనంగా స్థానాలను (125స్థానాలను) గెలుచుకుంటుందని ఇండియా టుడే కోసం సిసెరో చేసిన సర్వేలో ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. జెడి(యు) నాయకత్వంలోని మహాకూటమికి 106దాకా సీట్లు గెలుచుకుని గట్టిపోటీగా నిలుస్తుందని ఓపీనియన్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. కాగా, ఇతరులు 12చోట్ల గెలవచ్చు. అయితే, ఇంకా అసలు హడావుడి మొదలవలేదు. ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలను పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని నితీశ్ అభిప్రాయపడుతున్నారు. పైగా, ఈ సర్వే ప్రకారం చూసినా నితీశ్ కుమార్ కు అనుకూల పవనాలే కనిపిస్తున్నాయి.

ఐదేళ్ల క్రిందట అధికార జెడి(యు) 115 స్థానాలు గెలుచుకోగా, అప్పటి మిత్రపక్షమైన బీజేపీ 94చోట్ల గెలుపొందింది. ప్రభుత్వఏర్పాటుకు కావాల్సిన సీట్లు ఏ ఒక్క పార్టీకి రాకపోవడంతో అధికస్థానాలు గెలుచుకున్న జేడీయు బిజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కాగా, అప్పటి ఎన్నికల్లో ఆర్ జేడీ 22 చోట్ల, కాంగ్రెస్ నాలుగు, లోక్ జన శక్తి మూడుచోట్ల విజయం సాధించింది.

ప్రస్తుత ఓపీనియన్ పోల్ ఫలితాలను నిశితంగా గమనిస్తే, జెడీయు నాయకత్వంలోని మహాకూటమి పార్టీలు వోట్లలో 40శాతం పంచుకోవచ్చు. ఇది గత ఎన్నికల్లో వోట్ల శాతంతో పోలిస్తే 9.8శాతం తక్కువ. ఇక బీజేపీ దాని మిత్రపక్షాలకు ఈసారి 42వోటుశాతం సొంతం కావచ్చు. ఇది 18శాతం ఎక్కువ. అయితే, నితీశ్ కుమార్ కు వ్యక్తిగతంగా ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి అభ్యర్థులైన మిగతా నాయకులు సుశీల్ కుమార్ మోదీ (బీజేపీ) ఆర్ జేడీ నాయకుడు లాలూప్రసాద్ కంటే నితీశ్ పరిస్థితి చాలా మెరుగ్గానే ఉంటుందని ఓపీనియన్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. మొత్తంమీద ఈసారి ఎన్నికలు నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే, నితీశ్ కుమార్ నాయకత్వంలోని మహాకూటమికి మధ్యనే ఉండబోతున్నది.

బిహార్ ఎన్నికలు ఐదుదశల్లో జరుగుతాయి. అక్టోబర్ 12న తొలివిడత పోలింగ్, ఆ తర్వాత అక్టోబర్ 16, తిరిగి 28న, నవంబర్ 1, 5 తేదీల్లో పోలీంగ్ జరుగుతుంది. నవంబర్ 8న ఫలితాలను వెల్లడిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close