ముద్ర‌గ‌డ వ్యూహర‌చ‌న‌లో లోపం అదే..!

కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పాద‌యాత్ర ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. దాన్ని పోలీసులు అడ్డుకుని, ఆయ‌న్ని గృహ నిర్బంధం చెయ్య‌డం, కాపుల నేత‌ల్ని అదుపులోకి తీసుకోవ‌డం, యువ‌త‌కు కౌన్సిలింగులు ఇవ్వ‌డం.. ఇవ‌న్నీ వ‌రుస‌గా జ‌రిగిపోతున్నాయి. ముద్ర‌గ‌డ చేప‌ట్టిన ఛ‌లో అమ‌రావ‌తి పాద‌యాత్ర‌కు అనుమ‌తి లేద‌నేది పోలీసుల వాద‌న‌! నిజానికి కిర్లంపూడిలో చోటుచేసుకున్న ప‌రిణామాలేవీ అనూహ్య‌మైన‌వి కావు. ముద్ర‌గ‌డ‌ను మ‌రోసారి గృహ నిర్బంధం చేస్తార‌ని ముందు నుంచీ తెలుస్తున్న‌దే. ఆయ‌న పాద‌యాత్ర కిర్లంపూడి దాటి బ‌య‌ట‌కి రాద‌నేదీ అర్థ‌మౌతోంది. ముందేం జ‌ర‌గ‌బోతోందో దాదాపు నెల‌రోజుల కింద‌టి నుంచీ తెలుస్తూ ఉంటే.. ఒక ఉద్య‌మాన్ని న‌డిపే నాయ‌కుడిగా ముద్ర‌గ‌డ ప్ర‌ణాళిక ఎలా ఉండాలి..? వ‌్యూహ‌ర‌చ‌న ఎంత ప‌క్కాగా ఉండాలి..? కానీ, ఈసారి కూడా అలాంటి ముంద‌స్తు వ్యూహాలేవీ ముద్ర‌గ‌డ వేసుకోలేద‌ని మ‌రోసారి స్ప‌ష్ట‌మౌతోంది. గ‌తంలో ఎదురైన అనుభ‌వాల నుంచీ ఏమీ నేర్చుకోలేదా అనే విమ‌ర్శ‌లూ అక్క‌డ‌క్క‌డా వినిపిస్తున్నాయి.

గ‌త కొన్నేళ్లుగా జ‌రుగుతున్న‌ది రొటీన్ తంతు ఇదే! ముద్ర‌గ‌డ దీక్ష అంటారు, లేదంటే యాత్ర అంటారు! దానికి అనుమ‌తుల్లేవ‌ని పోలీసులు అంటారు. స‌రిగ్గా ఆరోజు వ‌చ్చేస‌రికి అక్క‌డి నుంచీ ఒక‌ట్రెండు రోజుల హై డ్రామా! అంతే, అక్క‌డితో మ‌రికొన్నాళ్లు కాపు రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మానికి విరామం. ఉద్య‌మాన్ని రాష్ట్రవ్యాప్తం చేయ‌డంలో ముద్ర‌గ‌డ వ్యూహాత్మంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని మ‌రోసారి విమ‌ర్శ‌లు వినిపించ‌డం మొద‌లౌతోంది. ఆ మ‌ధ్య జిల్లాల‌న్నీ క‌లియ‌దిరిగారు. సినీ రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల్ని క‌లుసుకున్నారు. ఇక‌పై జిల్లా స్థాయిల నుంచి కూడా ఉద్య‌మం ఉంటుంద‌న్నారు. కానీ, ఇప్పుడు మ‌ళ్లీ కిర్లంపూడి కేంద్రంగానే ఉద్య‌మం సాగుతోంది. ముద్ర‌గ‌డ‌ను గృహ నిర్బంధం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున స్పంద‌న వ‌చ్చేలా జిల్లా క‌మిటీలు ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా కేంద్రంలో నిర‌న‌స‌లు జ‌ర‌పాలి. కానీ, అలాంటి ప‌క్కా ప్ర‌ణాళిక‌లేవీ కాపు ఉద్య‌మంలో క‌నిపించ‌డం లేదనే విమ‌ర్శ వినిపిస్తోంది.

ఛ‌లో అమ‌రావ‌తి పాద‌యాత్ర‌ను పోలీసులు అడ్డుకున్న స‌మ‌యంలో ముద్ర‌గ‌డ ఏమ‌న్నారంటే.. అనుమ‌తులు వ‌చ్చాక మ‌ళ్లీ పాద‌యాత్ర చేస్తాన‌నీ, రోజూ కాపులు త‌న ఇంటికి రావాల‌నీ పిలుపునిచ్చారు. ఈ అనుమ‌తుల గురించి ముందే ప్ర‌య‌త్నిస్తే స‌రిపోయేది క‌దా! ప్ర‌భుత్వాన్ని అనుమ‌తి కోరినతే.. వారు ఎలాగూ నిరాక‌రిస్తారు. అదే విష‌య‌మై ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేసేందుకు వాడుకోవ‌చ్చు. కాపు నేత‌ల్ని త‌న ఇంటికి రావాల‌ని ఆయ‌న ఇప్పుడు పిలుపునిచ్చారు! ఉద్య‌మ నేత‌గా ఈయ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలిగానీ… అష్ట దిగ్బంధ‌నంలో ఉన్న కిర్లంపూడికి రండి అంటే కాపులు ఎలా రాగ‌లుగుతారు..? ముద్ర‌గ‌డ ఉద్య‌మం ఈసారి చాలా తీవ్రంగా ఉంటుంద‌ని కాపు సామాజిక వ‌ర్గం కూడా అనుకుంది. కానీ, ఇంకా ఆ తీవ్ర స్థాయి చేరే తొలి ద‌శ కూడా దాట‌లేదు. మున్ముందు ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి మ‌రి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close