‘యుద్ధం శ‌ర‌ణం’ ట్రైల‌ర్ : యాక్ష‌న్ ధ‌మాకా

అక్కినేని హీరోల‌కు రొమాంటిక్ హీరో అనే ఇమేజ్ ఉంది. దాన్ని దాటుకొని రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు నాగ‌చైత‌న్య‌. త‌న కొత్త చిత్రం ‘యుద్దం శ‌ర‌ణం’ ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. కృష్ణ ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న చిత్రం సంస్థ నిర్మించింది. పాట‌లు, ట్రైల‌ర్ ఈరోజు విడుద‌ల‌య్యాయి. టీజ‌ర్‌తో ఆల్రెడీ ఆక‌ట్టుకొన్న ‘యుద్దం శ‌ర‌ణం’… ట్రైల‌ర్‌లోనూ అదే జోష్‌.. అదే స్పీడ్ చూపించింది. `”మ‌న జీవితాలు ఆనందంగా ఉన్న‌ప్పుడు ప్ర‌పంచం అంతా అద్భుతంగా ఉన్న‌ట్టే అనిపిస్తుంది” అనే నాగ‌చైత‌న్య డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది.

ట్రైల‌ర్ చూస్తుంటే.. ఫాస్ట్ బేస్డ్ స్క్రీన్ ప్లేతో సాగే సినిమా అనే విష‌యం అర్థ‌మ‌వుతుంది. ప్ర‌శాతంగా జీవితం సాగిపోతున్న ఓ కుటుంబంలోకి ఓ క్రిమిన‌ల్ అడుగుపెడితే.. వాళ్ల జీవితాలు ఎలా మారిపోయాయో.. ఈ సినిమాలో చూపిస్తున్నారు.

”త‌ప్పించుకొనేవాడికెప్పుడూ రెండు ఆప్ష‌న్లుంటాయి. అయితే దాక్కోవ‌డం, లేదంటే పారిపోవ‌డం” అంటూ శ్రీ‌కాంత్ డైలాగ్‌కి ”ప‌రిగెత్తే ప్ర‌తివాడూ.. పారిపోతున్న‌ట్టు కాదు” అనే కౌంట‌ర్ ఆక‌ట్టుకొంది. ఈ సినిమా థీమ్ ఏంట‌న్న‌ది ఈ డైలాగ్‌లోనే అర్థ‌మైపోతోంది. వివేక్ సాగ‌ర్ ఇచ్చిన ఆర్‌.ఆర్‌, బ్యాక్‌గ్రౌండ్లో వినిపిస్తున్న ‘యుద్దం శ‌ర‌ణం’ థీమ్ మ్యూజిక్ ఈ ట్రైల‌ర్‌ని మ‌రింత‌గా ఎలివేట్ చేశాయి. సెప్టెంబ‌రు 8న ఈచిత్రం విడుద‌ల కాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : కష్టాల్లో నేనున్నానని భరోసా ఇచ్చే పాలకుడెవరో ఆలోచించండి !

ఓ డ్యామ్ పగిలిపోయింది.. కొట్టుకుపోయింది. డ్యామ్ అంటే చిన్న విషయం కాదు. ఆ డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయిందన్న సంగతి తర్వాత ముందుపాలకుడు ఏం చేయాలి ?. ఉన్న పళంగా అక్కడికి వెళ్లి...

‘ఆర్య‌’ @ 20 ఏళ్లు: ప్రేమ‌క‌థ‌ల్లో ట్రెండ్ సెట్ట‌ర్‌!

'ఐ ల‌వ్ యూ.. యూ ల‌వ్ మీ..' అని బ‌తిమాలుకొనేది ఒక త‌ర‌హా ప్రేమ క‌థ‌. 'నేను నిన్ను ప్రేమిస్తున్నా - నువ్వు కూడా న‌న్ను ప్రేమించాల్సిందే' అని బ‌ల‌వంతం చేసేది మ‌రో త‌ర‌హా...

బేలగా జగన్ – అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేస్తున్నారు !

నా వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్ ఎక్కడ.. ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం కలగడం లేదంటున్న జగన్ ఎక్కడ ?. మొదటిది ఏడాదిన్నర కిందట.. రెండోది పోలింగ్ కు వారం...

పోలింగ్ రోజున రాపిడో ఉచిత సేవలు

లోక్ సభ ఎన్నికల్లో ఓటు శాతం పెంచేందుకు ప్రముఖ ప్రయాణ యాప్ రాపిడో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న రాపిడో ఉచిత సేవలను అందిస్తుందని సంస్థ వెల్లడించింది. సోమవారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close