ఆంజ‌నేయుడిగా రానా?

బాహుబ‌లి త‌ర‌వాత రానా ప్ర‌యాణం పూర్తిగా మారిపోయింది. కొత్త కొత్త పాత్ర‌ల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. త‌న‌కు న‌ప్పే పాత్ర‌లే ఎంచుకొంటున్నాడు. గుణ‌శేఖ‌ర్ ఎంతో ఇష్ట‌ప‌డి రాసుకొన్న హిర‌ణ్య‌క‌శ్య‌ప పాత్ర రానాని వ‌రించింది. తాజాగా మ‌రో మైథ‌లాజిక‌ల్ క్యారెక్ట‌ర్ రానా చెంత‌కు చేరింది. త్వ‌ర‌లో రానా.. ఆంజ‌నేయుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌. `రావ‌ణ‌` సినిమాని తెర‌కెక్కించాల‌ని మోహ‌న్ బాబు ఫ్యామిలీ ఎప్ప‌టి నుంచో గ‌ట్టిగా క‌స‌ర‌త్తులు చేస్తోంది. రావ‌ణ‌గా మోహ‌న్‌బాబు క‌నిపించ‌బోతున్నారు. కొంత‌మంది బాలీవుడ్ న‌టులు కీల‌క పాత్ర‌లు పోషించ‌య‌నున్నారు. ఇందులో హ‌నుమంతుడి పాత్ర రానాతో చేయించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త రెండేళ్లుగా ఈ స్క్రిప్టుకు సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయి. అంత‌ర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం ప‌నిచేయ‌నున్నారు. ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. ఓ ద‌శ‌లో రాఘవేంద్ర‌రావు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మోహ‌న్‌బాబుకీ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటాల‌ని ఉంద‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా ఆంజ‌నేయ స్వామి పాత్ర రానాకే ద‌క్కింద‌ని స‌మాచారం. మ‌రి ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో, ద‌ర్శ‌కుడు ఎవ‌రో తేలాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close