ఈ వారం.. శిరోభారం

ఒకేసారి 5 సినిమాలొస్తున్నాయంటే – ద‌స‌రా సీజ‌న్ ముందే వచ్చేసింద‌న్నంత ఉత్సాహం వ‌చ్చింది. తీరా ఆ ఐదూ తుస్సుమ‌నేశాయి. వారానికి నాలుగైదు సినిమాలొచ్చిన‌ప్పుడు క‌నీసం ఒక్క సినిమా అయినా నిల‌దొక్కుకొనేది. ఓకే అనిపించుకొనేది. ఈసారి ఆ అవ‌కాశ‌మూ ద‌క్క‌లేదు తెలుగు ప్రేక్ష‌కుల‌కు. ఉంగ‌రాల రాంబాబు, శ్రీ‌వ‌ల్లీ, క‌థ‌లో రాజ‌కుమారి, స‌ర‌సుడు, వీడెవ‌డు… ఇవ‌న్నీ డిజాస్ట‌ర్లుగా మిగిలిపోయాయి. క‌నీసం ఉంగ‌రాల రాంబాబుకైనా ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని ఆశించారు. కానీ సునీల్ ఆ అంచ‌నాల్నీ అందుకోలేక‌పోయాడు. నారా రోహిత్‌, నాగ‌శౌర్య‌.. ఇద్ద‌రికీ మ‌ల్టీప్లెక్స్‌లో మంచి ఆద‌ర‌ణే ల‌భించేది. ఇద్ద‌రూ క‌ల‌సి చేసిన సినిమా, పైగా హిట్ కాంబినేష‌న్‌, టైటిల్ కూడా పొయెటిక్‌గా ఉంది.. అయినా స‌రే, మ‌ల్టీప్లెక్స్‌లో టికెట్లు తెగ‌లేదు. హైద‌రాబాద్‌లో అయితే పేరున్న మ‌ల్టీప్లెక్స్‌ల‌న్నీ ఖాళీగా క‌నిపించాయి. క‌నీసం 20 శాతం ఆక్యుపెన్సీ కూడా లేక‌పోవ‌డంతో నిర్మాత‌ల్ని బాగా నిరాశ ప‌ర్చింది. ఇక శ్రీ‌వ‌ల్లీ, స‌ర‌సుడు, వీడెవ‌డు సినిమాల్ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అలా ఐదుకి ఐదూ… నిరాశ ప‌రిచాయి. అప్పుడెప్పుడో విడుద‌లైన ఫిదా, అర్జున్ రెడ్డి సినిమాలే మ‌ళ్లీ దిక్క‌య్యాయి. ఈవారం ‘జై ల‌వ‌కుశ‌’ వ‌స్తోందిగా. ఆ వెంట‌నే ‘స్పైడ‌ర్’ రంగంలోకి దిగుతాడు. ‘మ‌హాను భావుడు’ కూడా క్యూ క‌ట్ట‌బోతున్నాడు. కాస్త ఓపిక ప‌డితే – బాక్సాఫీసు ద‌గ్గ‌ర మ‌ళ్లీ క‌ళ‌క‌ళ‌లు చూడొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close