శివ బాలాజీ యే బిగ్ బాస్ సీజన్-1 విన్నర్

మొత్తానికి సస్పెన్స్ కి తెరపడింది. బిగ్ బాస్ సీజన్ -1 తెలుగు విన్నర్ గా శివ బాలాజీ నిలిచాడు. ఈ సాయంత్రం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో తుది రౌండ్ లో ఫైనలిస్టులుగా మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ మధ్య జరిగిన ఆసక్తికర పోరు లో టైటిల్ విన్నర్ గా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీ తో పాటు కోట్లాది ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు శివ బాలాజీ.

ఇంతకు మునుపు వారం దీక్ష ఎలిమినేషన్ తర్వాత, హరితేజ, అర్చన, నవదీప్, ఆదర్ష్, శివ బాలాజీ లు చివరి వారం లో పోటీదారులుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐదుగురిలో ఎవరికి వారు తమదైన ప్రత్యేకత కలిగి, అందరూ టైటిల్ కి అర్హులుగా కనిపించారు. కానీ ఇవాళ సాయంత్రం దేవిశ్రీ ప్రసాద్ పెర్ఫార్మెన్స్ తో షో మొదలయ్యాక, కాసేపటికి ఎలిమినేషన్స్ మొదలయ్యాయి. ఈ ఎలిమినేషన్ లో మొదటగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చింది అర్చన. ఎలిమినేషన్ తర్వాత కాస్త దిగాలుగా కనిపించిన అర్చన, ఇక్కడి దాకా తను రావడానికి కారణమైన ప్రేక్షకులకి కృతఙ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన నవదీప్ హుందాగా స్పందించాడు. తాను వైల్డ్ ఎంట్రీ గా వచ్చినందువల్ల తనకంటే ఎక్కువ రోజులు కష్టపడ్డ మిగిలిన అభ్యర్థులు తనకంటే ఎక్కువ ఈ టైటిల్ కి అర్హులు అంటూ స్పందించాడు.

ఇక హరితేజ, ఆదర్ష్, శివబాలాజీ మిగిలినపుడు తారక్ ఒక అవకాశం ఇచ్చాడు. మీలో ఎవరికైనా ఈ టైటిల్ గెలవను అని గట్టిగా అనిపిస్తే, మీ ఎదురుగా ఉన్న బ్రీఫ్ కేస్ లో 10 లక్షలున్నాయి, అవి తీసుకుని మీరు షో నుంచి నిష్క్రమించవచ్చు అని ఆఫర్ ఇచ్చాడు కానీ, ముగ్గురిలో ఎవరూ దానికి స్పందించలేదు. ఇక ఆ తర్వాత ఎలిమినేట్ అయిన హరితేజ తనకెందుకో, నెక్స్ట్ ఎలిమినేషన్ తనదే అని మనసుకి ఒక్క క్షణం అనిపించింది అని చెప్పింది. దాదాపు 2 కోట్లకి పైగా ఓట్లు సంపాదించిందని తారక్ చెప్పినపుడు ఆనందానికి లోనైంది, ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పింది.

ఇక చివరగా శివబాలాజీ, ఆదర్ష్ మిగిలారు. ఆ సమయం లో ఎన్ టీయార్, స్వయానా తానే హౌస్ లోకి వెళ్ళి, ఇద్దరినీ బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. ఇద్దరూ 3 కోట్లకి పైగా ఓట్లు సంపాదించారు. కేవలం 8.5 లక్షల ఓట్ల తేడా రన్నరప్, విన్నర్ ల ని డిసైడ్ చేసింది. ఈ తుది పోరులో శివబాలాజీ టైటిల్ విన్నర్ గా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీ గెలిచాడు. మిగతా పార్టిసిపెంట్స్ అంతగా ప్రేక్షలని ఎంటర్టైన్ చేయలేకపోయినా, తన నిజాయితీ తో, మిగతా పార్టిసిపెంట్స్ ని హ్యాండిల్ చేయడం లో తాను చూపిన సహనం, మెచ్యూరిటీ తో ప్రేక్షకుల హృదయాలని, టైటిల్ ని గెలిచాడు.

దీంతో, 70 రోజులపాటు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన షో ముగింపుకొచ్చింది. మరి సీజన్-2 కోసం ప్రేక్షకులలో అప్పుడే చర్చ మొదలవడం, ఈ షో కి లభించిన ఆదరణకి తార్కాణం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close