జాతీయహౌదా కన్న సైకిల్‌ మిన్న

ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన వివిధ స్థాయిల కార్యవర్గాలలో పెద్ద సంచలనాలేమీ లేవు. కాకుంటే ఫిరాయింపుదార్లకు పెద్దపీట వేసి విధేయులను చిన్నబుచ్చారనే విమర్శ ఒకటి ఎలాగూ వుంటుంది.వచ్చిన వారిని ఇముడ్చుకోవడం కోసం చేసే పనే అది. ఈ సందర్భంగా చంద్రబాబు జాతీయ అద్యక్షుడుగా లోకేశ్‌, ఇ.పెద్దిరెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించారు. ఇదంతా గంభీరంగా కనిపించేందుకు లోకేశ్‌కు పార్టీలో స్థానాన్ని అట్టిపెట్టేందుకు చేసే పని తప్ప రాజకీయంగా ఇతర జాతీయ పదవులకు పెద్ద ప్రాధాన్యత లేదని టిడిపి నాయకులు తేల్చిచెబుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబుకు అలాటి మోజు వుండేది. చుట్టుపక్కల రాష్ట్రాలలో సీట్లు రాకున్నా ఓట్ల శాతం తెచ్చుకుని జాతీయ ముద్ర వేసుకోవాలన్న కాంక్ష వుండేది. అది కేంద్రంలో కీలకపాత్రకు తోడ్పడుతుందన్న వ్యూహంతో అవన్నీ ఆలోచించేవారు. అయితే ఇప్పుడు దానిపై అంత ఆసక్తి లేదు. తెలంగాణలోనే పార్టీ దెబ్బతిన్నది. తమిళనాడులో జయలలిత వుంటే ఏవైనా అప్రధానమైన సీట్లు తెచ్చుకోవడానికి అవకాశం వుండేదేమో.. ఆపైన తెలుగువారు ఎక్కువ వుండే మరేదైనా రాష్ట్రంలోనూ ఓట్లు తెచ్చుకుంటే సరిపోయేది. ఇప్పుడదంతా మారింది. తమిళనాడు అస్తవ్యస్తంగా వుంది. జాతీయంగా మోడీ ప్రభుత్వం చంద్రబాబుపై విముఖత కొనసాగిస్తున్నది.ఇలాటప్పుడు జాతీయ ఆశలు ఆవిరై పోతున్నాయి. పైగా మరో పెద్ద సమస్య జాతీయ పార్టీ అయితే సైకిల్‌ గుర్తు వుండదు. సమాజ్‌వాది పార్టీకి ఆ గుర్తు వుంది కనుక మాకు రాదు. ఈ గుర్తును కాపాడుకోవడం పార్టీకి చాలా ఉపయోగం. అప్పట్లో గుర్తు కోసమే ఎన్టీఆర్‌తో ఘర్షణ పడాల్సి వచ్చింది. ఇప్పుడు దాన్ని పోగొట్టుకోలేము.పైగా జాతీయంగా అవకాశాలు కూడా లేవు.కాబట్టి అది కేవలం అలంకారం మాత్రమేనని ఆ నాయకుడు స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close