శర్వానంద్ కి కాంపిటీషనే బాగా కలిసి వస్తోందా?

జై లవ కుశ, స్పైడర్ ల తర్వాత ఈ దసరా కి వచ్చిన మహానుభావుడు సినిమా నిన్న రిలీజై, మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే

అయినా ఇలాంటి కాంపిటీషన్ బాగా కలిసివస్తున్నట్టుంది శర్వానంద్ కి. 2016 సంక్రాంతి కి ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ చేసినప్పుడు – నాన్నకి ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనల మధ్య నలిగిపోతాడని అనుకున్నారంతా. కానీ ఆశ్చర్యంగా మంచి వసూళ్ళు సాధించాడు. మళ్ళీ 2017 సంక్రాంతి కి ఖైది నంబర్ 150, గౌతమీ పుత్ర లాంటి బడా సినిమాలతో పాటు రిలీజ్ చేసాడు శతమానం భవతి ని. చిరు 150, బాలయ్య 100 వ సినిమాల మధ్యలో వచ్చిన ఈ సినిమా కూడా మంచి హిట్టయింది. ఆశ్చర్యమేంటంటే, ఎక్స్ప్రెస్ రాజా తర్వాత రాజాధి రాజ అనే శర్వానంద్ సినిమా పెద్ద పోటీ లేని సమయం లో వచ్చింది. అలాగే శర్వానంద్ సినిమా రాధ కూడా, శతమానం భవతి తర్వాత 2017 మే లో పెద్ద పోటీ లేకుండానే వచ్చింది. కానీ కాంపిటీషన్ పెద్దగా లేని సమయం లో వచ్చిన ఆ సినిమాలుపెద్ద గా ఆడలేదు.

మళ్ళీ ఇప్పుడు స్పైడర్, జై లవకుశ లు థియేటర్లలో ఉన్నపుడే వచ్చిన ఈ మహానుభావుడు కి మాత్రం మంచి హిట్ టాక్ వచ్చింది.. చూస్తుంటే ఎంతో కొంత పెద్ద హీరోల సినిమాల సందడి, కాంపిటీషన్ తో పాటు తన సినిమా రిలీజ్ చేయడమే శర్వానంద్ కి కలిసి వస్తున్నట్టుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close