రాజుగారికీ ‘సుచీ లీక్స్‌’కి సంబంధం ఏమిటి?

రేపే రాజుగారి గ‌ది 2 ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ముందు ఇది హార‌ర్ కామెడీ సినిమా అనుకొన్నారు. వాటితో పాటు.. ఎమోష‌న్ డ్రామా ఉంటుంద‌ని, ఫ్యామిలీకీ న‌చ్చే అంశాలున్నాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. వీటితో పాటు ఇప్పుడో కొత్త యాంగిల్ బ‌య‌ట‌ప‌డింది. ఇటీవ‌ల సంచ‌ల‌నం రేపిన ‘సుచీ లీక్స్‌’ లాంటి యాంగిల్ ఈ సినిమాలో ప్ర‌స్తావించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని స‌మంతే చెప్పింది. సుచీ అనే పేరు తీసుకురాలేదు గానీ…. `లీక్స్‌` అంటూ వ‌చ్చిన వీడియోలు రేపిన సంచ‌ల‌నం చుట్టూ ఈ సినిమా తిర‌గ‌బోతోంద‌ని అర్థ‌మైంది. ఆ వీడియోలు చూసిన వాళ్ల‌కు, షేర్ చేసిన వాళ్ల‌కు, పంపిన వాళ్లకు ఈ సినిమాలో త‌న పాత్ర ఓ మెసేజ్ ఇవ్వ‌బోతోంద‌ని స‌మంత చెప్పేసింది. సో… సుచీలీక్స్ లాంటి వివాదం ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌న్న‌మాట‌.

రాజుగారి గ‌ది 2లో స‌మంత లా స్టూడెంట్‌గా క‌నిపించ‌బోతోంది. చాలా సెన్సిటీవ్ అయిన స‌మంత ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సిన ప‌రిస్థితులు వ‌స్తాయ‌ట‌. దానికి కార‌ణం.. సుచీ లీక్స్ లాంటి వ్యవ‌హార‌మే అని తెలుస్తోంది. క్లైమాక్స్ లో అమ్మాయిల గురించి స‌మంత చెప్పే డైలాగుల‌కు క్లాప్స్ కొట్ట‌డం ఖాయ‌మంటోంది చిత్ర‌బృందం. ఆయా స‌న్నివేశాల్లో స‌మంత గ్లిజ‌రిన్ కూడా వాడ‌లేద‌ట‌. సుచీ లీక్స్ వ‌ల్ల ఇబ్బంది ప‌డిన అమ్మాయిల్ని త‌ల‌చుకొంటూ ఆ పాత్ర‌లో లీన‌మైపోయి న‌టించింద‌ట‌. మ‌రి ఆ స‌న్నివేశాలు ఏ స్థాయిలో పండాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close