సాహో ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింద‌హో…

ప్ర‌భాస్ త‌న పుట్టిన రోజుకి స‌రైన గిఫ్టే అందించాడు. సాహో ఫ‌స్ట్ లుక్‌ని బ‌య‌ట పెట్టి.. అభిమానుల్ని అల‌రించాడు. ప్ర‌భాస్ పుట్టిన రోజుకి సాహో నుంచి త‌ప్ప‌కుండా ఏదో ఒక స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని భావిస్తూ వ‌చ్చింది చిత్ర‌సీమ‌. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ రోజు ఉద‌యం సరిగ్గా 9.గం.30 నిమిషాలకు సాహో ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ప్ర‌భాస్ లాంగ్ సూట్‌లో, హాలీవుడ్ హీరోలానే క‌నిపిస్తున్నాడు. కాక‌పోతే.. ప్ర‌భాస్‌ని పూర్తిగా చూసే అవ‌కాశ‌మే రాలేదు. క‌ళ్లు మాత్ర‌మే క‌నిపించేలా ఈ ఫ‌స్ట్ లుక్ ని డిజైన్ చేశారు. చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణం.. ఆ డిజైన్ చూస్తుంటే క‌చ్చితంగా ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలోనే ఉండ‌బోతోంద‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి రూ.150 కోట్ల పెట్టుబ‌డి పెడుతున్నారు. సుజిత్ ద‌ర్శ‌కుడు. శ్ర‌ద్దా క‌పూర్ క‌థానాయిక‌. శంక‌ర్ ఎహ్‌సాన్ రాయ్ సంగీతం అందిస్తున్నారు. సాహో మేకింగ్ వీడియో కూడా బ‌ట‌య‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌భాస్ పుట్టిన రోజు సంబ‌రాలు ఆదివారం రాత్రి నుంచే మొద‌లైపోయాయి. త‌న స‌న్నిహితుల‌కు ఆదివారం రాత్రి మంచి పార్టీ ఇచ్చాడు. సోమ‌వారం మీడియాకు, బాహుబ‌లి టీమ్‌కీ, సాహో చిత్ర‌బృందానికీ ప్ర‌భాస్ పార్టీ ఇస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close