ఎవడ్రా బాబు.. త్రివిక్రమ్

”ఆడు మగాడ్రా బుజ్జి’… అతడు సినిమా కోసం త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఇది. ఇది ఆయనకే అన్వయిస్తే ”డైరెక్టర్ అంటే త్రివిక్రమ్రా రా బుజ్జి” అని చెప్పక తప్పుదు. నిజమే.. త్రివిక్రమ్ ఓ అద్భుతం. భీమవరం నుంచి వైజాగెళ్లి ఆంధ్రా యూని వర్సిటీలో ఎమ్మెస్సీ చదివిన ఓ కుర్రాడు హైదరాబాదొచ్చి సినీ పరిశ్రమలో నిలబడి తెలుగు సినిమా ఒరవడిని మార్చేస్తాడని ఎవరైనా ఊహించారా ? ! తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేస్తాడని అనుకున్నారా? ఇంత అద్భుతాన్ని చేసి చూపించాడు త్రివిక్రమ్. అందుకే డైరెక్టర్ అంటే త్రివిక్రమ్రా బుజ్జి.

‘అతడు’ తెలుగు సినిమా రచయితల విలువను కోటి రూపాయలకు చేర్చిన మాటల మాంత్రికుడు. నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా రచయితల విలువను ఒకే సారి వందమెట్లు ఎక్కించేశాడు త్రివిక్రమ్. ఆయన మాటలు కోట్లు దాటిపోయాయి. ఇది సినిమా పరంగా. కానీ త్రివిక్రమ్ కి మాట విలువ తెలుసు. ”రెండు దేశాలు ఒక్కదగ్గర కూర్చుని మాట్లాడుకుని ప్రపంచ యుద్దాలను ఆపేస్తాయి. అలాంటింది ఇద్దరు మనుషుల మధ్య వైరం ఓ మాటతో పోగొట్టలేమా?” అని ప్రశ్నించి అలోచింపచేస్తాడాయన. మాట విలువ తెలిసిన వ్యక్తికాబట్టే.. అన్నీ విలువైన మాటలే రాస్తాడు. ఆయన మాటల్లో చమక్ ఉటుంది. ఇంకాస్త లోతుగా వెళితే జీవిత సత్యం వుంటుంది. అందుకే ఆయన్ని కేవలం మాటల రచయిత, దర్శకుడిగానే చూడలేం. త్రివిక్రమ్ ‘అంతకుమించి’.

ఎవడ్రా బాబు.. త్రివిక్రమ్

త్రివిక్రమ్ పేరు స్వయంవరం సినిమాతో మార్మ్రోగిపోయింది. ఎవడ్రా బాబు.. త్రివిక్రమ్ !! ఇలా రాశేస్తున్నాడు. అని అంతా మాట్లాడుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిగిరి చూసుకోలేదు. అయితే ఈ దశలో తన స్పెషాలిటీ ని కూడా నిలుపుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయనకు పదుల సంఖ్యలో అడ్వాన్స్ చెక్కులు అందాయి. అయితే ఆయన మాత్రం ఏ చెక్కును తీసుకోలేదు. రాయాలనిపించినపుడు రాశారు. తనకు నచ్చిందే రాశారు. డబ్బుతో కాకుండా సినిమాని మనసుతో చూసే వ్యక్తిల్లో త్రివిక్రమ్ ఒకరు.

అందరికీ త్రివిక్రమే కావాలి

ఇండస్ట్రీ లో టాప్ రైటర్ గా వెలుగుతున్న సమయంలోనే మెగా ఫోన్ పట్టుకున్నారు త్రివిక్రమ్. నువ్వే నువ్వే దర్శకుడిగా ఆయన తొలి సినిమా. ఈ సినిమాతో యూత్ ను కట్టిపడేశారు. తర్వాత మహేష్ తో సినిమా అతడు లో కూడా తన మ్యాజిక్ ను రిపీట్ చేశారు తివిక్రమ్. ఈ సినిమాతో టాప్ దర్శకుడి లీగ్ లో చేరిపోయారు త్రివిక్రమ్. ఈ సినిమాతో ఆయనకు కుప్పలు తెప్పలుగా ఆయనకు అవకాశాలు వచ్చి పడ్డాయి. అయితే ఆయన మాత్రం తొందర పడలేదు. తన మనసుకు నచ్చిందే రాస్తున్నారు. తీస్తున్నారు. 2005లో వచ్చిన అతడు తర్వాత.. 2017 వరకూ ఆయన తీసిన సినిమాలు 7. దిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆయన ఎంత సెలక్టీవో. ఒక విధంగా ఇదే ఆయనను డిఫరెంట్ గా నిలిపింది. ఒక హీరోతో సినిమా చేయాలని కలలు కంటాడు దర్శకుడు. కాని త్రివిక్రమ్ త్రివిక్రమ్ విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది. త్రివిక్రమ్ తో సినిమా చేయాలని బడా హీరోలు సైతం లైన్ లో వున్నారంటే ఆర్ధం చేసుకోవచ్చు. ఆయన క్రియేట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు త్రివిక్రమ్ అందరు హీరోలూ కోరుకునే దర్శకుడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. జల్సా అతారింటికి దారేది చిత్రాలతో సరికొత్త వినోదాల్ని పంచిన ఈ జోడి ఇప్పుడు హ్యాట్రిక్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆశిస్తూ.. త్రివిక్రమ్ కు హ్యాపీ బర్త్ డే..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close