బిహార్ మహిళలు ఏం చేయబోతున్నారు ?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ఇవ్వాళ పూర్తయింది. మొత్తం 243 స్థానాలకుగాను 49 చోట్ల జరిగిన పోలింగ్ లో 57శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఓటింగ్ శాతంతో ఇప్పటికే బీజేపీ ఓ అంచనాకు వచ్చింది. ప్రజలు మార్పుకోరుకుంటున్నారనీ, ఓటర్లలో చైతన్యం కనిపిస్తున్నదన్నది ఆ పార్టీ భావన. ఓటింగ్ శాతం 70ల్లోనో, 80ల్లోనో లేకపోయినా 57శాతం పోలవడం చిన్న విషయం కాదని ఎన్నికల కమిషన్ అధికారులే అంటున్నారు. ఐదేళ్ల క్రిందట బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 50.85శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలిస్తే ఈ తొలిదశ పోలింగ్ లోనే ఆ మార్క్ ను అధిగమించినట్లయింది. ఇంకా నాలుగు విడతల పోలింగ్ మిగిలేఉంది. ఓటర్లలో చైతన్యం ఇదేమోస్తరుగాఉంటే కచ్చితంగా రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదవుతుంది. పోలింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు సంకేతమన్న నానుడి ఉంది. ఈ రకంగా ఆలోచిస్తే బీజేపీ తనకు సానుకూలమని అనుకోవడంలో తప్పేమీలేదు.

తొలివిడుత పోలింగ్ లో పురుషులు 59.5 శాతం ఓటుహక్కు వినియోగించుకోగా, మహిళలు 54.5 శాతంమంది పోలింగ్ కేంద్రాలకు వెళ్ళారు. ఈసారి బిహార్ ఎన్నికల్లో మహిళా ఓటింగ్ శాతం చాలా కీలకమైనదని దాదాపు అన్నిపార్టీలు విశ్వసిస్తున్నాయి. మహిళలు సాధారణంగా కుల,మతపరమైన రాజకీయాలకంటే, అభివృద్ధికి పెద్దపీటవేస్తారు. మహిళా సాధికారితకు పట్టంకట్టేవారే పాలకులుగా ఉండాలని కోరుకుంటారు. దీంతో మహిళా ఓటు బ్యాంక్ అన్నది డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారిపోయింది. ఇప్పుడున్నపరిస్థితి చూస్తుంటే మహిళా మనోబలమే అంతిమ విజయానికి బాటలు వేస్తుందనిపిస్తోంది. తొలిదశలో కోటి 35 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.వారిలో దాదాపు సగం మంది మహిళలే.

ప్రశాంతం..ఓ శుభసూచికం

తొలిదశ పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఇదో శుభసూచకం. ఎన్నికలు సవ్యంగా జరగడంకోసం మూడు డ్రోన్ల సహాయం కూడా తీసుకున్నారు. మిగతా నాలుగు దశల పోలింగ్ కూడా ఇదే మోస్తరుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా అంటున్నారు.

మరో విశేషంఏమంటే, ఇవ్వాళ జరిగిన 49 నియోజకవర్గాల్లోనే గతంలో అంటే 2010లో పోలింగ్ జరిగినప్పుడు వాటిలో 29సీట్లు జనతాదళ్ (యునైటెడ్) గెల్చుకుంది. అయితే అప్పట్లో జెడియూ , బిజేపీతో కలసి బరిలో నిలిచింది. కానీ ఇప్పుడు రెండూ విభిన్న శిబిరాలకు నాయకత్వం వహిస్తున్నాయి. ఈ 49సీట్ల పరంగా చూస్తే, జేడీయు గతంలోలాగా 29సీట్లు గెలుచుకోలేదు. ఎందుకంటే అన్నిసీట్లలో అది పోటీచేయలేదు. 24చోట్ల మాత్రమే నితీశ్ కుమార్ పార్టీ తన అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా, లాలూకి చెందిన ఆర్ జేడీ 17చోట్ల , కాంగ్రెస్ 8చోట్ల పోటీ చేసింది. గతంలో జేడీయుకి ఓటు వేసిన ఓటర్లను లాలూ ఎంతమేరకు ఆకర్షించారన్నది ఫలితాల రోజున తేలిపోతుంది. ఈ ఆకర్షణ లేకపోతే ఫలితాలు తారుమారవుతాయనడంలో సందేహంలేదు.

మోదీకి కీలకం, ఎందుకంటే…

ప్రధాని అంతటి వాడు బిహార్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి?
అది చెప్పుకునేముందు మరికొన్ని లెక్కలు తెలుసుకోవాలి. తొలిదశ పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో బీజేపీ 27చోట్ల పోటీచేయగా దాని మిత్రపక్షమైన రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ – ఎల్ జేపీ 13చోట్ల అభ్యర్థులను దింపింది. తలివిడత పోలింగ్ జరిగిన ఈ ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికలు జరిగినప్పుడు ఎనిమిదింటిలో నాలుగు చోట్ల ఎల్ జేపీ విజయం సాధించింది. రాజ్యసభలో బీజేపీ తనబలం పెంచుకోవాలంటే ఇప్పుడు బిహార్ ఎన్నికల ఫలితాలు దానికెంతో కీలకం. రాజ్యసభలో బలం పెంచుకోనంతకాలం, పార్లమెంట్ లో ముఖ్యమైన బిల్లులను గట్టెక్కించుకోలేదు. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం పేలవంగానే ఉంది. ఈ కారణంగా బిహార్ ఎన్నికల పట్ల ప్రధాని మోదీ చాలా ఆశలుపెట్టుకున్నారు. తనదైన మార్క్ సంస్కరణలు చేపట్టాలంటే బిహార్ లో ఘనవిజయం ఒక్కటే ప్రస్తుతానికి ఆయన ముందున్న రహదారి. అంతేకాదు, బిహార్ ఎన్నికల సరళి రాబోయే రాష్ట్రాల ఎన్నికలపై పడుతుంది. వచ్చేఏడాది బెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బిహార్ ఫలితాలు నవంబర్ 8న వెల్లడవుతాయి. ఆరోజు బిజేపీ తన ఆశలు పండించుకోగలిగితే మిగతా రాష్ట్రాలతోపాటు పార్లమెంట్ లో కూడా తన హవా నిర్భీతిగా సాగిపోతుంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close