బీహార్ లో బీజేపీ ఐడియా వర్క్ అవుట్ అవుతుందా?

రేపు బీహార్ అసెంబ్లీలో 32 స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. మొదటి,రెండవ విడత ఎన్నికల మధ్య కాలంలో బీహార్ రాజకీయాలలో కొన్ని స్పష్టమయిన మార్పులు కనబడుతున్నాయి. జనతా పరివార్ నుండి విడిపోయి ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ ఈ ఎన్నికలలో ఎన్ని స్థానాలు గెలుస్తుందో తెలియదు కానీ బీజేపీకి దగ్గరవుతోంది. దాని అధ్యక్షుడు ములాయం సింగ్ తన ఎన్నికల ప్రచారసభలో బీహార్ ప్రజలని “ఏ పార్టీకయినా ఓట్లు వేయండి కానీ నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కి మాత్రం ఓట్లు వేయవద్దని” కోరారు. బీజేపీ జాతీయవాదాన్ని మెచ్చుకొన్నారు. మోడీ మంచి సమర్దుడయిన ప్రధాని అని మెచ్చుకొన్నారు. అంటే ఎన్నికల తరువాత ఆయన బీజేపీతో చేతులు కలుపుతారని అర్ధం అవుతోంది.

ఇక లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ఇరువురూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను ఎదుర్కొనలేక తడబడుతున్నారు. అందుకే నితీష్ కుమార్ “బీహార్ రాష్ట్రాన్ని బీహారీలు పరిపాలించుకోవాలా లేకపోతే బాహర్ ఆద్మీ (బయటవాళ్ళు) పరిపాలించాలా…ప్రజలే ఆలోచించుకోవాలి” అని ప్రజలలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బయటవాళ్ళు అంటే ఆయన ఉద్దేశ్యం గుజరాత్ కి చెందిన నరేంద్ర మోడి, అమిత్ షా అని. అందుకు అమిత్ షా చాలా ధీటుగానే జవాబు చెప్పారు. “ఎన్నికల ప్రచారానికి వచ్చినవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయరు.ఎన్నికలలో పోటీ చేసి గెలిచినా వాళ్ళు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే సంగతి ముఖ్యమంత్రి ఉన్న నితీష్ కుమార్ కి తెలియదా?” అని ప్రశ్నించారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నంలో “ఇంతవరకు బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎందుకు ప్రకటించలేదు?తన ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ప్రకటించకపోయినా ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లు సంపాదించుకొనేందుకు ఒక అరడజను పేర్లను మీడియాకి లీక్ చేసి రహస్య ప్రచారం చేస్తోంది,” అని ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఆ ఆరోపణలు నిజమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే బీజేపీ దాని మిత్రపక్షాలలో రామ్ విలాశ్ పాశ్వాన్, జితన్ రామ్ మంజీ, సుశీల్ కుమార్ మోడీ, ప్రేమ కుమార్ వంటివారు ఒక అరడజను మంది బీహార్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. వారిలో ఎవరి పేరు ప్రకటించినా మిగిలినవారు అలగవచ్చును లేదా కీలకమయిన ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయవచ్చును. అందుకే బీజేపీ ఎవరి పేరు ప్రకటించే సాహసం చేయలేకపోయింది. కానీ వారందరూ తామే ముఖ్యమంత్రి అవుతామనే నమ్మకం వ్యక్తం చేస్తు ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. అంటే వివిధ వర్గాలు, కులాలకు చెందిన ఆ అరడజను ముఖ్యమంత్రి అభ్యర్ధులను చూపిస్తూ ఆయా వర్గాలు, కులాలకు చెందిన ఓటర్లకు బీజేపీ గాలం వేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. ఎన్నికలలో ఇదొక సరికొత్త వ్యూహమేనని చెప్పవచ్చును. సాధారణంగా రాజకీయ పార్టీలన్నీ నియోజక వర్గాలలో ఉన్న కుల, మత సమీకరణాలను బట్టి అందుకు తగ్గ అభ్యర్ధిని నిలబెడుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి అభ్యర్ధికి కూడా బీజేపీ ఈ ఐడియా వర్తింపజేయడంతో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ఇద్దరూ కంగు తిన్నారు.

బీహార్ ఎన్నికలలో చాలా పార్టీలు, కూటములు, స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో ఉన్నప్పటికీ ఇంతవరకు పోటీ ప్రధానంగా నరేంద్ర మోడి-అమిత్ షా వెర్సస్ నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ యాదవ్ మధ్యనే జరుగుతోంది. ఈ పరిణామాలను అన్నిటినీ చూస్తుంటే ప్రస్తుతం నరేంద్ర మోడి-అమిత్ షా టీమ్ లీడింగ్ లో ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ నెగ్గుతుందో…లేకపోతే ఈ పార్టీలు, కూటముల మధ్య ప్రజల ఓట్లు చీలిపోయి ‘సంకీర్ణ టీమ్’ ఏర్పడుతుందో తెలియాలంటే నవంబర్ 8న ఫలితాలు వెలువడేవరకు వేచిచూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close