శ్రీనువైట్ల పని అయిపోయిందా..?

నీకోసం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీనువైట్ల అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోల సినిమాలను డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడు. కామెడీని కమర్షియల్ థోరణిలో చెప్పడంలో డైరక్టర్ శ్రీనువైట్లకు పెట్టింది పేరు. ఆయన తీసిన రెడీ,డీ సినిమాలు ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టవు. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే శ్రీనువైట్ల పని అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ తో దూకుడు లాటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న శ్రీనువైట్ల ఎన్టీఆర్ ను బాధ్షాగా చూపినా అంతగా ఆకట్టుకోలేదు.

ఇక మళ్లీ మహేష్ తో తీసిన ఆగడు సినిమా హిట్ అవడం అటుంచితే దర్శకుడిగా చాలా విమర్శలు ఫేస్ చేశాడు శ్రీనువైట్ల. ఆగడు ఫ్లాప్ తో కసి మీద చెర్రి సినిమా హిట్ కొడటాడనుకుంటే మళ్లీ అదే పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాను తెరకెక్కించి దెబ్బ పడేలా చేసుకున్నాడు. తన మూల కథ అయినా సరే తన ఆస్థాన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ల సహాయంతో సినిమాను ఓ రేంజ్లో తీస్తాడనుకుంటే.. సినిమాను తను అలవాటు పడ్డ పాత థోరణిలోనే నడిపించి ఆడియెన్స్ కి విరక్తి కలిగేలా చేశాడు.

మెగాస్టార్ రీ ఎంట్రీ అనే సందర్భం లేకుండా బ్రూస్ లీ కనుక వచ్చి ఉంటే చరణ్ కిది ఆగడు సినిమా రిజల్ట్ ని ఇచ్చిండేది. అందుకే శ్రీనువైట్ల ఇక స్టార్ హీరోల సినిమాలకు పనికిరాడని డిసైడ్ అయ్యారు. వారి ఇమేజ్ ని డ్యామేజ్ చేసి ఊహించని విధంగా ఫ్లాప్స్ చవిచూసేలా చేస్తున్న శ్రీనువైట్ల ఇక నుండి మళ్లీ చిన్న హీరోల సినిమాలే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టే ఉంది చూస్తుంటే.

వరుసెంట ఫ్లాప్స్ ఇస్తున్న దర్శకుడికి ఏ హీరో మాత్రం పిలిచి అవకాశం ఇస్తాడు చెప్పండి. ఏమన్నా మళ్లీ తన థోరణి పూర్తిగా మార్చుకుని క్రియేటివ్ గా పనిచేస్తే తప్పా.. మళ్లీ శ్రీనువైట్లకు స్టార్ హీరోల డేట్స్ దొరికే ఛాన్స్ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close